
Renu Agarwal Murder: రేణు అగర్వాల్ హత్య కేసు.. జార్ఖండ్‌లో పట్టుబడ్డ నిందితులు
ఈ వార్తాకథనం ఏంటి
కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న రేణు అగర్వాల్ హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో నిందితులను పట్టుకోవడానికి జార్ఖండ్‌కు వెళ్లిన ప్రత్యేక బృందం వారిని అదుపులోకి తీసుకుంది. ఇద్దరు నిందితులను ప్రస్తుతం హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. టెక్నికల్ ఆధారాలు, ఇతర సాక్ష్యాలను విశ్లేషించి నిందితుల జాడను గుర్తించగలిగామని పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలో వ్యాపారవేత్త భార్య రేణు అగర్వాల్ (45)ను దారుణంగా హత్య చేసిన ఘటన గురువారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. ఘటన రోజు రేణు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలోనే ఈ దారుణం జరిగింది. ఉదయం ఆమె భర్త, కుమారుడు షాపుకు వెళ్లగా, ఆమె ఇంట్లో ఒంటరిగా మిగిలారు.
Details
ఆధారాలను సేకరించిన పోలీసులు
సాయంత్రం నుండి రేణు ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో భర్త ఆందోళన చెందారు. రాత్రి 7 గంటల సమయంలో ఇంటికి చేరుకుని, వెనుక తలుపు ద్వారా కార్మికుడితో తలుపులు తెరిచారు. ఇంట్లోకి వెళ్లినప్పుడు రేణు అగర్వాల్ హాల్‌లో చేతులు, కాళ్లు తాళ్లతో బంధించబడిన స్థితిలో హత్యకు గురైనట్లు గుర్తించారు. నెల రోజుల క్రితం హర్ష అనే యువకుడిని జార్ఖండ్ నుంచి సహాయకుడిగా తీసుకువచ్చారని పోలీసులు తెలిపారు. హర్ష, ఇంటి పై అంతస్తుల్లో నివసిస్తున్న రోషన్‌తో స్నేహం పెంచుకున్నాడు. హత్య జరిగిన రోజున సాయంత్రం హర్ష, రోషన్ ఇద్దరూ కలిసి ఒక బ్యాగ్‌తో బైక్‌పై ఇంటి నుంచి వెళ్ళిపోయినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు.