LOADING...
Actor Darshan: రేణుకాస్వామి హత్య కేసు.. దర్శన్‌ బెయిల్‌ను రద్దు చేసిన సుప్రీం
రేణుకాస్వామి హత్య కేసు.. దర్శన్‌ బెయిల్‌ను రద్దు చేసిన సుప్రీం

Actor Darshan: రేణుకాస్వామి హత్య కేసు.. దర్శన్‌ బెయిల్‌ను రద్దు చేసిన సుప్రీం

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 14, 2025
12:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడైన కన్నడ నటుడు దర్శన్‌ (Actor Darshan)కు బెయిల్‌ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) తిరస్కరించింది. కర్ణాటక హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేస్తూ, జస్టిస్‌ పార్దివాలా, జస్టిస్‌ ఆర్‌ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. విచారణలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ, దర్శన్‌కు బెయిల్‌ ఇచ్చేందుకు ఎలాంటి చట్టపరమైన కారణాలు లేవని స్పష్టం చేసింది. బెయిల్‌ మంజూరు సాక్షులపై ప్రభావం చూపే అవకాశం ఉందని జస్టిస్‌ మహాదేవన్‌ వ్యాఖ్యానించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని హెచ్చరిస్తూ, దర్శన్‌ను కస్టడీలో ఉంచే సమయంలో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం లేదని జైలు అధికారులకు సూచించారు.

Details

జైలు సూపరింటెండెంట్‌పై చర్యలు తీసుకోవాలి

నిందితులకు జైల్లో ఫైవ్‌స్టార్‌ ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నట్లు తేలితే, జైలు సూపరింటెండెంట్‌పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దర్శన్‌ను తక్షణమే అదుపులోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కర్ణాటకలో సంచలనంగా మారిన రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌, ఆయన స్నేహితురాలు పవిత్ర గౌడ సహా 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. రేణుకాస్వామిని చిత్రహింసలకు గురిచేసి, కరెంట్‌ షాక్‌ ఇచ్చి హత్య చేసినట్లు విచారణలో తేలింది. పోస్టుమార్టం నివేదిక కూడా ఇదే విషయాన్ని నిర్ధారించింది. హైకోర్టు గతేడాది అక్టోబర్‌లో దర్శన్‌కు మధ్యంతర బెయిల్‌ ఇవ్వగా, డిసెంబర్‌ 13న రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసింది. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది.