LOADING...
#NewsBytesExplainer: నువ్వా.. నేనా.. తెలంగాణలో రాజీనామా రాజకీయాలు .. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్.. 
నువ్వా.. నేనా.. తెలంగాణలో రాజీనామా రాజకీయాలు .. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్..

#NewsBytesExplainer: నువ్వా.. నేనా.. తెలంగాణలో రాజీనామా రాజకీయాలు .. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 26, 2025
04:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాజకీయాల్లో రాజీనామాల అంశం చర్చనీయంగా మారింది. రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఓట్ చోరీ యాత్రను సమర్థించుకోవడానికి , తెలంగాణలో కూడా ఓటు చోరీ జరిగిందని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆరోపించారు. ఓట్ చోరీ చేయకపోతే బండి సంజయ్ కు అంత మెజార్టీ ఎలా వస్తుందని వాదించారు. తెలంగాణలో బీజేపీ తరపున గెలిచినవారి విజయం కూడా, ముఖ్యంగా ఓటు చోరీ వల్లనే సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. మహేష్ గౌడ్ చేసిన ఆరోపణలకు బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు.

వివరాలు 

డూప్లికేట్ ఓట్లు తొలగించి మళ్లీ ఎన్నికలు

"ఇలా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఏర్పడిందీ?"అని ప్రశ్నిస్తూ,తమకే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో అని వారు చెప్పారు.ఇంకా రాజీనామాల విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని, డూప్లికేట్ ఓట్లు తొలగించి మళ్లీ ఎన్నికలు జరిపించాలంటూ సవాల్ చేశారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా అదే డిమాండ్ చేశారు. తాము ఓడిపోయిన ప్రాంతాల్లో ఓటు చోరీని ఆరోపించడం కొంతవరకు నమ్మకంగా అనిపించవచ్చు, కానీ గెలిచిన ప్రాంతాల్లో, ప్రభుత్వం ఉన్న ప్రాంతాల్లో, సగం పార్లమెంట్ సీట్లు సాధించిన చోట కాంగ్రెస్ ఈ రకమైన ఆరోపణలు చేయడం ఎబ్బెట్టుగా మారింది.

వివరాలు 

కాంగ్రెస్,బీజేపీ అన్నట్లుగా.. తెలంగాణలో రాజకీయాలు

నిజానికి, ఓటు చోరీ అనేది బీఆర్ఎస్ పార్టీకి రావాల్సిన డౌట్. ఎందుకంటే ఆ పార్టీ సగం సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది. ఇంత దారుణంగా ఓడిపోతామని అనుకోలేదు. కానీ ఈ అంశంపై బీఆర్ఎస్ ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతోంది. ఫలితంగా, వైపీపీకి, బీఆర్ఎస్ పార్టీకి ఒక్కటే సమస్య. అందుకే తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ రాజకీయాలు ప్రధానంగా ఓటు చోరీ ఇష్యూలో చర్చ జరుగుతున్నాయి. గ్రౌండ్ లో పార్టీలు తమ ప్రామాణిక స్థానాలను నిలుపుకోవడమే లక్ష్యంగా, రాజకీయ ప్రవర్తనను ఈ విధంగా మలుపు తిరుగుతున్నారు.