Page Loader
Revanth Reddy: నేడు దిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీని కలిసే అవకాశం
Revanth Reddy: నేడు దిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీని కలిసే అవకాశం

Revanth Reddy: నేడు దిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీని కలిసే అవకాశం

వ్రాసిన వారు Stalin
Dec 19, 2023
10:28 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం దిల్లీ వెళ్తున్నారు. దిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ కార్యకలాపాలతో ఆయన బిజీ బిజీగా గడపనున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల సన్నాహాలపై వీరితో రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. తెలంగాణలోని వివిధ కార్పొరేషన్లు, బోర్డుల్లో కీలక పదవుల్లో పార్టీ నేతల నియామకంపై ఆయన అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది. అయితే.. ప్రధాని మోదీని కలిసేందుకు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ కోరారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల గురించి రేవంత్ మోదీకి వివరించనున్నారు. మోదీ అపాయింట్‌మెంట్ ఇంకా ఖరారు కాలేదని పీఎంఓ వర్గాలు తెలిపాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కాంగ్రెస్ పెద్దలతో కీలక భేటీ