
Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం,ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు లోకల్ బాడీ ఎలక్షన్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్‌లో ఎన్నికలు జరగాలన్న లేఖను ఎన్నికల కమిషన్‌కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. అదేవిధంగా, రిజర్వేషన్లలో ఉన్న సీలింగ్ క్యాప్‌ను తొలగించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రత్యేక జీవో ద్వారా ఈ ఎన్నికలకు వెళ్ళాలని, అలాగే రిజర్వేషన్ల పరిమితిని తొలగిస్తూ అసెంబ్లీలో తగిన తీర్మానాన్ని తీసుకోవాలని నిర్ణయించింది. ఈ బిల్లును త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
వివరాలు
ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్
మరోవైపు, తెలంగాణ కేబినెట్ ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజహరుద్దీన్‌ను ఎంపిక చేసింది. ఈ ఎంపికపై కేబినెట్‌లో చర్చ జరిగింది. మంత్రివర్గం వీరి పేర్లను అధికారికంగా ఆమోదించింది. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ ఎన్నికలను సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపధ్యంలో.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎమ్మెల్సీగా అజహరుద్దీన్ ఎంపిక ఆసక్తికరరంగా మారింది.