Revanth Reddy: లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్.. తెలంగాణ ఎన్నికల కమిటీ చైర్మన్‌గా రేవంత్ రెడ్డి
ఈ వార్తాకథనం ఏంటి
25-Member Committee: లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది.
ఈ మేరకు ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో 25 మంది సభ్యులతో తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీని కాంగ్రెస్ హైకమాండ్ ఏర్పాటు చేసింది.
ఈ కమిటీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, సి.దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, డి.శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క సభ్యులుగా ఉన్నారు.
అలాగే సీనియర్ నాయకులు కె. జానా రెడ్డి, వి.హనుమంతరావు, జె.గీతారెడ్డిలకు కూడా చోటు దక్కింది.
వీరితోపాటు ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి, వై.మధు యాష్కీ గౌడ్, ఎస్.ఎ.సంపత్ కుమార్, రేణుకాచౌదరి, జగ్గారెడ్డి వంటి సీనియర్లు కూడా ప్యాలెన్‌లో ఉన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్
The Hon'ble Congress President has approved the proposal of the Pradesh Election Committee, Telangana as:- pic.twitter.com/EAYyW5jXaC
— Telangana Congress (@INCTelangana) January 6, 2024