Rgv : బర్రెలక్కపై ఆర్జీవీ వివాదాస్పద వ్యాఖ్యలు.. శిరీష సీరియస్.. మహిళా కమిషన్‌లో ఫిర్యాదు
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై బర్రెలక్క(శిరీష) సీరియస్ అయింది. ఇటీవలే కొల్లాపూర్ ఎన్నికల్లో ఆమె పోటీ చేశారు. పవన్ కల్యాణ్'ను విమర్శించేందుకు శిరీష పేరును వైఎస్సాఆర్ కాంగ్రెస్ నేతలు ఉపయోగించుకుంటున్నారు. తాజాగా వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్'లో రామ్ గోపాల్ వర్మ బర్రెలక్కపై చేసిన కామెంట్లు.. వివాదాస్పదమయ్యాయి. ఈ క్రమంలోనే ఆమె తరపున లాయర్ రామ్ గోపాల్ వర్మ మీద మహిళా కమిషన్'లో ఫిర్యాదు చేశారు. ఊరు పేరు లేని ఆవిడ చాలా ఫేమస్ అయిపోయింది. కాస్త బర్రె లెక్క ఉంటుంది, బర్రెలు లెక్క ఆమె మాట కూడా వింటున్నారు, అందుకే ఆమెను బర్రెలక్క అంటారు అని ఆర్జీవీ అన్నట్లు మహిళా కమిషన్'లో ఫిర్యాదు నమోదైంది.
ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోవాలన్న ఆర్జీవీ లాయర్
తమ ప్రాంత బిడ్డలు ఎదగాలని చేసే ప్రయత్నంలో ఆర్జీవీ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయమి న్యాయవాది మండిపడ్డారు. దీనిపై మరింత పోరాటం చేస్తామన్నారు.రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే తెలంగాణ నుంచి తరిమి కొడతామన్నారు. మరోవైపు వ్యూహం సినిమా నిలిపేయాలని ఆర్జీవీపై ఇప్పటికే నారా లోకేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లోకేశ్ రిట్ పిటిషన్ పరిగణలోకి రాదని,రిట్ పిటిషన్ మైనటనబుల్ కాదని ఆర్జీవీ తరపు లాయర్ నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. సెంట్రల్ సెన్సార్ బోర్డు కమిటీ ఉంటుందని, ఒకవేళ సినిమాపై అభ్యంతరాలుంటే వాళ్లు చూసుకుంటారన్నారు. కానీ సెన్సార్ బోర్డు ఎలాంటి అడ్డు చెప్పకుండా వ్యూహం చిత్రానికి సర్టిఫికెట్ ఇచ్చింది.వ్యక్తులను, పార్టీలను కించపరిచేలా ఉంటే కోర్టులో పరువు నష్టం దావా వేసుకోవాలని ఆర్జీవీ లాయర్ సూచించారు.