
PM Modi: గంగా సప్తమి రోజున ప్రధాని నామినేషన్.. వారణాసిలో గ్రాండ్ రోడ్ షో
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు. మంగళవారం ఆయన వారణాసిలో నామినేషన్ వేయనున్నారు. ఇందుకోసం పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
సోమవారం ఉత్తర్‌ప్రదేశ్'లో పర్యటించి.. కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించనున్నారు. అటు తరువాత ఆ ప్రాంతంలో రోడ్‌షో కూడా నిర్వహించనున్నారు.
మంగళవారం గంగా సప్తమి రోజున పుష్య నక్షత్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్ దాఖలు చేస్తారు.
సాయంత్రం వారణాసిలో మోడీ రోడ్‌షో చేసేందుకు భారీగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.
Details
ప్రధాని నామినేషన్ లో పలువురు సీనియర్ బిజెపి నాయకులు
ప్రధానమంత్రి కాన్వాయ్ BHU గేట్ ముందు ఉన్న మహామానా జీ విగ్రహం నుండి బయలుదేరి కాశీ విశ్వనాథ ఆలయం వరకు వెళ్తుంది.
ప్రధానికి పూలతో స్వాగతం పలికేందుకు దాదాపు ఇరవై వేల కిలోల పూలను ఆర్డర్ చేసినట్లు చెబుతున్నారు.
ప్రధాని రోడ్ షో, నామినేషన్ దాఖలు సమయంలో, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సహా పలువురు సీనియర్ బిజెపి నాయకులు పాల్గొంటారు.
వారణాసిలో నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ప్రధాని జార్ఖండ్ పర్యటనకు వెళ్లనున్నారు. ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగిస్తారు.
కాగా,జూన్ 1న జరిగే ఏడవ విడత ఎన్నికల్లో భాగంగా వారణాసిలో పోలింగ్ జరుగనుంది