Page Loader
మణిపూర్‌లో మళ్లీ అలజడి.. బెటాలియన్‌పై దాడి చేసి తుపాకులు చోరీ
మణిపూర్‌లో మళ్లీ అలజడి.. బెటాలియన్‌పై దాడి చేసి తుపాకులు చోరీ

మణిపూర్‌లో మళ్లీ అలజడి.. బెటాలియన్‌పై దాడి చేసి తుపాకులు చోరీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 04, 2023
03:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సాయుధ బలగాల క్యాంప్‌లపై ఓ వర్గం దాడి చేసి భారీగా ఆయుధాలను ఎత్తుకెళ్లారు. ఏకె రైఫిల్స్‌తో పాటు ఘటక్ సిరీస్ కి చెందిన తుపాకులు, 19వేల బులెట్స్ ను దొంగలించినట్లు తెలుస్తోంది. బిష్ణుపూర్‌లోని బెటాలియన్ హెడ్ క్వార్టర్స్ లో ఈ దోపిడీ జరిగినట్లు అధికారులు ధ్రువీకరించారు. అల్లర్లలో చనిపోయిన వారికి సామూహిక దహన సంస్కారాలు చేసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున చురచంద్‌పూర్‌‌కి ర్యాలీ చేపట్టారు. అదే సమయంలో ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. 195 సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్, 5ఎంపీ-5 గన్స్, 16 9ఎంఎం పిస్టల్స్, 25 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, 124 హ్యాండ్ గ్రనేడ్ లు ఎత్తుకెళ్లారు.

Details

శాంతి భద్రతలను అదుపులోకి తీసుకురావాలని వినతి

హింసాత్మక ఘటనలను సద్దుమణించేందుకు ఆర్మీతో పాటు ఆర్ఎఎఫ్ బలగాలు ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. ఈ దాడిలో 25 మందికి గాయాలయ్యాయి. సామూహిక దహన సంస్కారాలపై ఇప్పటికే మణిపూర్ హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఇండియా కూటమికి చెందిన 21 మంది నేతలు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముని ఇటీవలే కలిశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆధ్వర్యంలో ఆ నేతలంతా కలిసి మణిపూర్ ఘటనపై రాష్ట్రపతికి వినతి పత్రాన్ని సమర్పించారు. శాంతి భద్రతలను అదుపులోకి తీసుకు రావాలని వారు కోరారు. ఇటీవల మణిపూర్ పర్యటనలో విపక్ష ఎంపీలు గవర్నర్ అనుసూయ ఉయ్‌కీని కలిశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను అదుపులోకి తీసుకురావాలని మెమొరాండం ఇచ్చారు.