తదుపరి వార్తా కథనం

Nagarjuna Sagar: నాగార్జున సాగర్ లో పెరుగుతున్న నీటిమట్టం.. 10 గేట్లు ఎత్తి నీటి విడుదల
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 07, 2025
12:08 pm
ఈ వార్తాకథనం ఏంటి
నాగార్జునసాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువగా నిలిచింది. ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను మరోసారి తెరిచారు. మొత్తం 10 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి ప్రకారం, జలాశయం ఇన్‌ఫ్లో 1,33,824 క్యూసెక్కులు, అలాగే ఔట్‌ఫ్లో కూడా 1,33,824 క్యూసెక్కులు కొనసాగుతోంది. కుడి కాల్వ ద్వారా 9,500 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 8,454 క్యూసెక్కులు, పవర్‌హౌస్ ద్వారా 32,480 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు, అయితే ప్రస్తుతానికి 589.70 అడుగులు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు, ప్రస్తుతం 311.14 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.