
AP MLC: నెల్లూరులో రోడ్డు ప్రమాదం.. ఏమ్మెల్సీకి తీవ్ర గాయాలు.. పీఏ మృతి
ఈ వార్తాకథనం ఏంటి
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
కోడలూరు మండలం చంద్రశేఖరపురం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తూర్పు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి (Parvarat Reddy Chandrasekhar Reddy) తీవ్ర గాయాలపాలయ్యారు.
ఈ ప్రమదంలో ఎమ్మెల్సీ పీఏ వెంకటేశ్వరరావు అక్కడిక్కడే మృతి చెందారు.
కారు టైరు పంక్చర్ కావడంతో అదుపు తప్పి ముందు వెళ్తున్న లారీ వెనుక భాగాన్ని వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఇక ఎమ్మెల్యే తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉన్నట్లు సమాచారం.
Details
ఎమ్మెల్సీని ఆస్పత్రికి తరలించిన జానీ మాస్టర్
ఇదే సమయంలో ఆ రోడ్డుపై వెళ్తున్న టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన కారులో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదాన్ని చూసి కారు ఆపిన జానీ మాస్టర్ వెంటనే స్పందించి ఎమ్మెల్సీ తలకు కట్టుకట్టారు.
ఆ తర్వాత ఎమ్మెల్సీతో పాటు క్షతగాత్రులను తన కారులో అపోలో ఆస్పత్రికి తరలించారు.
ఇదిలా ఉండగా.. కొద్ది రోజుల క్రితం పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఉపాధ్యాయ నియోజకవర్గాల పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.