శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఏర్పేడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని కారు ఢీకొట్టడంతో అందులో ఉన్న అరుగురు అక్కడిక్కడే మరణించారు. మరొ ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. తిరుమల నుంచి శ్రీకాళహస్తికి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జుయింది. బాధితులంతా విజయవాడ వాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మృతుల్లో ముగ్గురు మహిళలు
తిరుపతి: శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి మరొకరికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు తిరుమల నుంచి శ్రీకాళహస్తి వెళ్తుండగా ఘటన మృతుల్లో ముగ్గురు మహిళలు మృతులు విజయవాడ వాసులుగా గుర్తింపు#Srikalahasti #Tirupati #RoadAccident— TV9 Telugu (@TV9Telugu) July 9, 2023