Page Loader
Robert Vadra:'భారతదేశంలో ముస్లింలు బలహీనంగా ఉన్నారు'.. పహల్గామ్ ఉగ్రవాద దాడిపై రాబర్ట్ వాద్రా వివాదాస్పద వ్యాఖ్యలు
పహల్గామ్ ఉగ్రవాద దాడిపై రాబర్ట్ వాద్రా వివాదాస్పద వ్యాఖ్యలు

Robert Vadra:'భారతదేశంలో ముస్లింలు బలహీనంగా ఉన్నారు'.. పహల్గామ్ ఉగ్రవాద దాడిపై రాబర్ట్ వాద్రా వివాదాస్పద వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 23, 2025
05:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గామ్ ఉగ్రదాడి దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చినప్పటికీ, కొందరు రాజకీయ నాయకులు మాత్రం ఈ ఘటనను కూడా రాజకీయ కోణంలోకి తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పహల్గామ్ దాడిని ప్రధాని నరేంద్ర మోదీకి హెచ్చరికలతో కూడిన సందేశంగా ఆయన పేర్కొనడం వివాదానికి దారితీసింది. అంతేకాకుండా ''ముస్లింలు బలహీన స్థితిలో ఉన్నారు'' అని వ్యాఖ్యానించడం ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.

వివరాలు 

 బీజేపీ చేపట్టిన హిందుత్వ రాజకీయాలే ఇందుకు కారణం

మంగళవారం కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు హిందువులను లక్ష్యంగా చేసుకుని చాలా దగ్గర నుంచి కాల్చిచంపారు. ఈ దారుణ ఘటనలో 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై స్పందించిన రాబర్ట్ వాద్రా మాట్లాడుతూ, ''భారతదేశంలో మైనారిటీలుగా ఉన్న ప్రజలు ప్రస్తుతం అసౌకర్యంగా, భయభ్రాంతులకు లోనవుతూ జీవిస్తున్నారు'' అని వ్యాఖ్యానించారు. దేశంలో బీజేపీ చేపట్టిన హిందుత్వ రాజకీయాలే ఇందుకు కారణమని ఆరోపించారు.

వివరాలు 

ప్రధానికి ఓ సందేశంలా ఉంది: వాద్రా 

''మన దేశంలోని ప్రస్తుత ప్రభుత్వం హిందుత్వాన్ని ప్రధానంగా ప్రొత్సహిస్తోంది.దీనివల్ల ముస్లింలు, ఇతర మైనారిటీలు భద్రతారాహిత్యం, ఒత్తిడిలో ఉన్నట్టు భావిస్తున్నారు. తాజాగా జరిగిన ఉగ్రదాడిలో ఉగ్రవాదులు తమ టార్గెట్లను గుర్తించి దాడి చేయడం చూస్తే, దేశంలో మతాల మధ్య విభజన ఎంత పెరిగిందో తెలుస్తోంది.అంతేకాకుండా, ఈ దాడి ఒక విధంగా ప్రధానికి ఓ సందేశంలా ఉంది. ముస్లింలు, మైనారిటీలు తమకు అన్యాయం జరుగుతోందని భావిస్తున్నారు'' అని వాద్రా అన్నారు.

వివరాలు 

వాద్రాపై మండిపడిన మాల్వియా

వాద్రా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా ప్రతిస్పందించింది.బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా రాబర్ట్ వాద్రా చేసిన వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ''ఇది నమ్మశక్యం కాని విషయం. సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఉగ్రవాద దాడిని న్యాయీకరిస్తూ మాట్లాడుతున్నారు. ఉగ్రవాదాన్ని ఖండించాల్సిన సమయంలో ఆయన దాన్ని సమర్థిస్తున్నట్టు కనిపిస్తున్నారు. అంతేకాదు, పాకిస్తాన్‌కి చెందిన ఉగ్రవాదుల ఆచరణలకు భారతదేశాన్ని బాధ్యుడిగా చేయడం వంటివి కూడా ఆయన వ్యాఖ్యల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి'' అని మాల్వియా మండిపడ్డారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అమిత్ మాల్వియా చేసిన ట్వీట్