Kishan Reddy: రూ.18,772 కోట్ల అంచనా వ్యయంతో ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు.. కిషన్ రెడ్డి ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్ఆర్ఆర్ (రింగురోడ్ ప్రాజెక్టు) మొత్తం అంచనా వ్యయం రూ.18,772 కోట్లు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
అలాగే రూ.300 కోట్ల వ్యయంతో ఆరాంఘర్ నుంచి శంషాబాద్ వరకు ఆరు లేన్ల నేషనల్ హైవే పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ హైవే నిర్మాణంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వారికి సిగ్నల్ ఫ్రీ రోడ్ లభిస్తుందని తెలిపారు.
పార్లమెంట్ సమావేశాల అనంతరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు.
Details
రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి కౌంటర్
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తమ పార్టీ కాంగ్రెస్ కంటే ఎక్కువ కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
అభివృద్ధి కోసం తాము పని చేస్తున్నామని, కాంగ్రెస్ చెప్పినవన్నీ తాము చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ అధినేత రేవంత్ రెడ్డి అభివృద్ధిపై అబద్ధాలు చెబుతున్నారని, రాష్ట్రంలో అప్పు రూ.7.50 లక్షల కోట్లు ఉండగా, ఇప్పుడు మూడున్నర లక్షల కోట్లు మాత్రమే ఉందనడం సరైనది కాదని విమర్శించారు.
నిన్న దిల్లీలో జరిగిన సమావేశంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ అధినాయకత్వం స్పందించలేదని కిషన్ రెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్ కేవలం రాజకీయాలు చేస్తోందని, ప్రజలు వారికి తగిన సమాధానం చెబుతారన్నారు.
Details
దక్షిణాదిలో బీజేపీకి ఓటమి లేనట్లు
తెలంగాణలో, దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పార్లమెంట్ స్థానాలు తగ్గే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల వ్యాఖ్యలను బోగస్ మాటలుగా అభివర్ణించారు.
తమిళ భాష అభివృద్ధి కోసం స్టాలిన్ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
హిందీ భాషపై వివాదం గురించి మాట్లాడిన కిషన్ రెడ్డి, దేశంలో ఎవరినీ హిందీ నేర్చుకోవాలని బలవంతపెట్టలేదని స్పష్టం చేశారు.
బీజేపీ విధానం ప్రకారం ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండాలని మాత్రమే కోరుకుంటున్నామని ఆయన తెలిపారు.