Loading...
AP 12th PRC: ఏపీ పీఆర్సీ కమిషనర్‌కు నెలకు రూ.2.25 లక్షల వేతనం
ఏపీ పీఆర్సీ కమిషనర్‌కు నెలకు రూ.2.25 లక్షల వేతనం

AP 12th PRC: ఏపీ పీఆర్సీ కమిషనర్‌కు నెలకు రూ.2.25 లక్షల వేతనం

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 24, 2026
04:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ) కమిషనర్ నియామకానికి సంబంధించిన నిబంధనలను ఖరారు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్‌ను 12వ పీఆర్సీ కమిషనర్‌గా నియమించిన నేపథ్యంలో.. ఆయనకు చెల్లించాల్సిన వేతనం, ఇతర సదుపాయాలు, నియామక విధివిధానాలపై ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ఆదేశాలు వెలువరించింది.

వివరాలు

నెలకు రూ.2.25 లక్షల ఫిక్స్‌డ్ వేతనం

పీఆర్సీ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించనున్న దినేష్ కుమార్‌కు నెలకు రూ.2,25,000 స్థిర వేతనం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ వేతనానికి కరువు భత్యం (డీఏ) వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

అయితే పునర్నియామక కాలంలో ఆయనకు అందే పెన్షన్‌పై డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్) వర్తించదని పేర్కొంది.

హెచ్‌ఆర్‌ఏ, టీఏ, డీఏ సదుపాయాలు

అపెక్స్ స్కేల్ అధికారులకు కల్పించే తరహాలోనే పీఆర్సీ కమిషనర్‌కు కూడా ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ), ప్రయాణ భత్యం (టీఏ), కరువు భత్యం (డీఏ) సదుపాయాలు వర్తింపజేయనున్నారు.

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ పేరుతో సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ADVERTISEMENT