Page Loader
Annadata Sukhibhav Scheme: రైతులకు రూ.20 వేలు సాయం.. అన్నదాత సుఖీభవపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
రైతులకు రూ.20 వేలు సాయం.. అన్నదాత సుఖీభవపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!

Annadata Sukhibhav Scheme: రైతులకు రూ.20 వేలు సాయం.. అన్నదాత సుఖీభవపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 28, 2025
03:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద రైతులకు ఏటా రూ.20,000 పెట్టుబడి సాయంగా అందించనున్నారు. అయితే నిధుల జమ విషయంలో స్పష్టత కోసం రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మూడవిడతలుగా నిధుల విడుదల మంగళవారం మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా రూ.20 వేలు మూడు విడతల్లో అందిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజనతో కలిపి అన్నదాత సుఖీభవను అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

Details

 పీఎం కిసాన్ + రాష్ట్రం = రూ.20వేలు

పీఎం కిసాన్ యోజన కింద రూ.6000 కేంద్రం అందిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 అదనంగా చెల్లించి మొత్తం రూ.20వేలుగా ఈ పథకం అమలవుతుందని సీఎం తెలిపారు. రైతులకు సహకారంగా కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్యంలో ఈ స్కీమ్ అమలవుతుందని వివరించారు. నిధుల విడుదల ఎప్పుడు? పీఎం కిసాన్ యోజన తొలి విడత నిధులను జూన్ నెలలో విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. కేంద్ర నిధులు విడుదలైన వెంటనే, రాష్ట్రం నుంచి కూడా అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే ఈ నిధులు కేవలం ఇకేవైసీ పూర్తి చేసిన రైతుల ఖాతాల్లో మాత్రమే జమవుతాయి.

Details

ఆన్‌లైన్ ద్వారా స్టేటస్ చెక్ చేసే విధానం

పథకానికి ఇప్పటికే చాలా మంది రైతులు దరఖాస్తు చేశారు. వారు [**https://annadathasukhibhava.ap.gov.in/**](https://annadathasukhibhava.ap.gov.in/) వెబ్‌సైట్‌ ద్వారా తమ దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు. హోమ్‌పేజ్‌లోని 'Know Your Status' లింక్‌ను క్లిక్ చేసి, ఆధార్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ చేయాల్సి ఉంటుంది. దీంతో దరఖాస్తు స్టేటస్ కనిపిస్తుంది.

Details

ఆఫ్‌లైన్ లోనూ సదుపాయం 

ఆన్‌లైన్‌ మాత్రమే కాకుండా రైతు సేవా కేంద్రాల్లోనూ స్టేటస్ తెలుసుకునే అవకాశం ఉంది. అక్కడ సిబ్బంది తమ లాగిన్‌ ద్వారా రైతుల వివరాలు చెక్ చేసి సమాచారం అందిస్తారు. అవసరమైతే జిల్లా వ్యవసాయ అధికారులను సంప్రదించవచ్చు. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి లేదా సమీప రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించండి.