
AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్‌లో రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం.. మిథున్‌రెడ్డి కీలక పాత్ర!
ఈ వార్తాకథనం ఏంటి
2019-2024 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌లో భారీ స్థాయిలో మద్యం కుంభకోణం చోటుచేసుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
కేవలం కొన్ని ఎంపిక చేసిన బ్రాండ్ల మద్యం మాత్రమే విక్రయించేలా పక్కా వ్యూహంతో వ్యవస్థను మార్చినట్లు తెలిపింది.
ఈ కుంభకోణం వెనుక వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డితో పాటు పలువురు శక్తిమంతమైన నాయకులు రూ.3,500 కోట్లు ముడుపులుగా దండుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై ప్రభుత్వం కౌంటర్ హర్జీ దాఖలు చేసింది.
Details
వ్యవస్థను చేతికి తీసుకునేందుకు వ్యూహం
2019 వరకు మద్యం సరఫరా కోసం ఆటోమేటెడ్ విధానం - C-Tel సాఫ్ట్‌వేర్ - ఆధారంగా పనిచేసేది.
దీని ద్వారా మద్యం డిమాండ్ ప్రకారం సరఫరాదారులకు ఆటోమేటిక్‌గా ఆర్డర్లు విడుదలయ్యేవి.
అయితే 2019 ఆగస్టు 16న జీఓ నం.357 జారీ చేసి ఏపీ బివరేజెస్ కార్పొరేషన్ (APSBCL) ఏర్పాటయ్యింది.
తర్వాత ఐఆర్టీఎస్ అధికారి వాసుదేవరెడ్డిని డిప్యుటేషన్‌పై APSBCL ఎండీగా, బివరేజెస్, డిస్టిలరీస్ కమిషనర్‌గా నియమించారు.
Details
పక్కా ప్లాన్, కుట్ర
వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, కెసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి తదితరులు కలిసి మద్యం విక్రయాల్లో చేతివాటం చూపేందుకు స్కెచ్ వేశారు.
APSBCL అధికారులను మేనేజ్ చేస్తూ, అవసరమైన అధికారిక పదోన్నతులు కల్పిస్తామన్న వాగ్దానాలు ఇచ్చారు.
ఆటోమేటెడ్ విధానాన్ని రద్దు చేసి, మాన్యువల్ విధానం అమలు చేసి, ప్రైవేట్ మెయిల్ ఐడీ ద్వారా ఎంపిక చేసిన బ్రాండ్లకే ఆర్డర్లు జారీ చేయాలని సూచించారు.
సీ-టెల్ ప్రాజెక్ట్ మేనేజర్ హెచ్చరికలు కూడా పట్టించుకోకుండా కొత్త విధానాన్ని అమలు చేశారు.
Details
మద్యం లావాదేవీలు - ముడుపుల వ్యవస్థ
సొంతంగా మద్యం తయారీ సామర్థ్యం లేని కంపెనీలకు పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇచ్చారు.
రూ.150 నుంచి రూ.600 వరకు కేసుకు ముడుపుల రేట్లు నిర్ణయించి, డేటా ఎన్ట్రీలను విజయసాయిరెడ్డికి పంపేలా MIS విభాగంలో అనూష అనే ఆపరేటర్‌ను నియమించారు.
సైఫ్ అనే వ్యక్తి లెక్కలు చేసి, కెసిరెడ్డికి పంపితే, ఆయన అవినాష్‌రెడ్డి, చాణక్యలకు ఫార్వర్డ్ చేసేవారు.
ప్రతీ ఐదు రోజులకు డబ్బును వసూలు చేసి, డిపో మేనేజర్ల ద్వారా ఆర్డర్ అమలు జరిగేది.
Details
లక్షల్లో కేసులు, కోట్లలో ముడుపులు
ప్రతి నెలా 27-30 లక్షల IML కేసులు, 7-10 లక్షల బీర్ కేసులు అమ్ముడయ్యేవి. ఒక్కో కేసుకు వసూలు చేసిన ముడుపులతో నెలకు రూ.50-60 కోట్ల మేర అక్రమ లాభాలు దండుకున్నారు. ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలిగింది.
విచారణకు మిథున్‌రెడ్డిని కస్టడీకి
ఈ కుట్రలో మిథున్‌రెడ్డి ముఖ్య పాత్ర పోషించారని, ఆయన్ను కస్టడీలోకి తీసుకుని లాభం పొందిన ఇతరులను గుర్తించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది.
ఈ కేసు ద్వారా రాష్ట్రంలోని మద్యం వ్యవస్థ ఎలా లంచాల వేదికగా మారిందో స్పష్టమవుతోంది.