Page Loader
RSS : మ‌ణిపూర్ హింస‌కు వాళ్లే కార‌ణమన్న మోహ‌న్ భ‌గ‌వ‌త్‌.. మీడియాను గుప్పెట పట్టారని ఫైర్
మ‌ణిపూర్ హింస‌కు వాళ్లే కార‌ణమన్న మోహ‌న్ భ‌గ‌వ‌త్‌.. మీడియాను గుప్పెట పట్టారని ఫైర్

RSS : మ‌ణిపూర్ హింస‌కు వాళ్లే కార‌ణమన్న మోహ‌న్ భ‌గ‌వ‌త్‌.. మీడియాను గుప్పెట పట్టారని ఫైర్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 24, 2023
03:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్క్సిస్ట్ మేధావులు మీడియా, బోధ‌నా రంగాన్ని గుప్పెట బిగించారన్నారు. దీంతోనే దేశ విద్యా వ్య‌వ‌స్ధ‌ను, సంస్కృతిని నాశ‌నం చేస్తున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నాగ్ పూర్‌లో ఆరెస్సెస్ ద‌స‌రా ర్యాలీని ఉద్దేశించి మోహ‌న్ భ‌గ‌వ‌త్ మాట్లాడారు. మ‌ణిపూర్ హింసాకాండ‌కు బ‌య‌టి శ‌క్తులే కార‌ణ‌మ‌ని భ‌గ‌వ‌త్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కొన్ని బయటి శక్తులు హింసను ప్రేరేపించాయని, ఈశాన్య రాష్ట్రం భ‌గ్గుమ‌నేందుకు అవే కార‌ణ‌మ‌న్నారు. ఎన్నో ఏళ్లుగా ఈశాన్య భారతంలో మైతీలు, కుకీలు క‌లిసిమెల‌సి జీవిస్తున్నారని, కానీ వారి మ‌ధ్య చిచ్చుపెట్టారన్నారు. శాంతి వెలిసే స‌మ‌యం వచ్చిందని, దాన్ని కూడా ఘర్షణనల వైపు మ‌ళ్లించారన్నారు. ఫలితంగా ఇరు వ‌ర్గాల్లో దూరం పెరిగిందన్నారు.

details

ఆర్ఎస్ఎస్ దసరా ర్యాలీకి ముఖ్యఅతిథిగా రావడం సంతోషకరం : మహదేవన్

ఇదే సమయంలో భారత్ వలసవాద మనస్తత్వం నుంచి విముక్తి పొందాలని ఆయన ఆభిలాషించారు. ప్రపంచం నుంచి మన దేశానికి సరిపోయేవే తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. కాలానికి తగినట్లు దేశ ఉత్పత్తులు రూపొందించుకోవాలన్న భగవత్, స్వదేశీ అభివృద్ధి మార్గాన్ని అవలంబించాల్సి ఉందన్నారు. సమాజ ఐక్యతతో అభివృద్ధికి సమాధానాన్ని అన్వేషించాలన్నారు. ఐక్యత పెంపొందించుకోవడం రాజ్యాంగంలో మార్గదర్శక సూత్రమని మోహన్‌ భగవత్‌ చెప్పుకొచ్చారు. మరోవైపు ఆర్ఎస్ఎస్ దసరా ర్యాలీకి ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్, ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం చాలా గౌరవంగా ఉందని మహదేవన్ అన్నారు. ఈ మేరకు మోహన్ భగవత్, ఆర్ఎస్ఎస్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 వలసవాద మనస్తత్వం నుంచి విముక్తి పొందాలన్న ఆర్ఎస్ఎస్ చీఫ్