
PM Modi: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తన జీవితాన్ని సామాజిక మార్పుకు అంకితం చేశారు: ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
ఈ రోజు సెప్టెంబర్ 11. ఇది రెండు పరస్పర విరుద్ధ స్మృతులను మనోఫలకంపైకి తెస్తుంది. 1893లో స్వామీ వివేకానందుడు షికాగో వేదికపై 'నా అమెరికన్ సోదర సోదరీమణులారా!' అని ఉత్కంఠభరితంగా ప్రసంగించి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశారు. భారతదేశ ఆధ్యాత్మికతను పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసి, సమస్త మానవుల మధ్య సౌభ్రాతృత్వాన్ని ప్రోత్సహించారు. ఈ తేదీతో చిరస్థాయిగా నిలిచిపోయిన మొదటి జ్ఞాపకం అదే. అయితే, అదే తేదీని మరో విధంగా గుర్తు చేసుకోవాలి. 2001లో ఈ రోజున అమెరికా పై ఉగ్రవాద దాడులు జరిగాయి. భారీ నష్టాలు, అనేక చేదు జ్ఞాపకాలు మిగిలిపోయాయి.
వివరాలు
పేదల కష్టాలపై సంపూర్ణ అవగాహన
అదేవిధంగా, సెప్టెంబర్ 11ను మరో కారణంతోనూ గుర్తుంచుకోవాలి.ఆ రోజున లక్షలమంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)కార్యకర్తలకు పరమపూజ్య నాయకుడు సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ 75వజన్మదినంగా జరుపుకుంటున్నాం.ఇదే సమయాన ఆరెస్సెస్ శతజయంతి సంవత్సరం కావడం మరో గొప్ప ఆనందం.ఈ రెండు శుభ సందర్భాలను పురస్కరించుకుని నేను భాగవత్ జీకి శుభాభివందనలు చెబుతున్నాను. మోహన్ భాగవత్ జీ ఆరెస్సెస్ లో చేరిన రోజు దేశం ఎమర్జెన్సీ అంధకార యుగం నడుస్తోంది. ప్రజాస్వామ్యం కోసం, దేశ ప్రగతి కోసం కట్టుబడిన వ్యక్తులందరూ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారు. మోహన్ జీతో పాటు వేలాది సంఘ్ కార్యకర్తలు అత్యంత చురుకైన సేవాకార్యక్రమాల ద్వారా పేద, బడుగు వర్గాల బాధలను గుర్తించి అందరికీ ఉపయుక్త సేవలు అందించారు.
వివరాలు
పేదల కష్టాలపై సంపూర్ణ అవగాహన
మహారాష్ట్రలోని అత్యంత వెనుకబడిన విదర్భ ప్రాంతాల్లో చేపట్టిన సేవా కార్యక్రమాల వల్ల మోహన్ జీ పేద, బడుగు వర్గాల కష్టనష్టాలను, బాగా అవగాహన చేసుకున్నారు. తరువాత, ఆయన తన అకుంఠిత దీక్ష,నిరంతర కృషి ద్వారా ఆరెస్సెస్‌లో ఉన్నతస్థానాలకు ఎదిగి, బిహార్ రాష్ట్రంలోని పల్లెలో చేపట్టిన సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల మౌలిక సమస్యలపై లోతైన అవగాహనను పొందారు. 2000లో సర్ కార్యవాహక పదవి చేపట్టి వివిధ సంక్లిష్ట కార్యాలను నైపుణ్యంగా నిర్వహించారు. 2009లో సర్ సంఘ్ చాలక్‌గా ఆరెస్సెస్‌లో అగ్రస్థానాన్ని పొందారు.ఈ పదవి కేవలం కార్యాచరణ నిర్వహించడమే కాకుండా,భరతమాత సేవ కోసం నిరంతర దీక్షతో పనిచేసే గొప్ప బాధ్యత.
వివరాలు
ఆయన ఒక వటవృక్షం
మోహన్ జీ అత్యంత బరువు బాధ్యతలతో కూడిన ఈ పదవికి పూర్తి న్యాయం చేస్తున్నారు. తన బలాబలాలను, మేధా పటిమను, సహానుభూతితో కూడిన నాయకత్వాన్ని అంకితం చేస్తున్నారు. దేశంకన్నా మరేదీ మిన్న కాదని చాటుతున్నారు. ఆరెస్సెస్ భారతీయ సంస్కృతి, జాతి ఆత్మను తొణికిసలాడే వటవృక్షంగా నిలబడి, ఈ విలువలను కొత్తతరం వరకు తరలించే ధ్యేయంతో మోహన్ భాగవత్ జీ నిరంతర శ్రమ చేస్తున్నారు. మోహన్ జీ వ్యక్తిత్వానికి మరింత వన్నె తెచ్చే లక్షణం- ఆయన మృదుభాషిత్వం. ఇతరుల మాటలను ఆసక్తితో, శ్రద్ధగా వినే లక్షణం ఆయనకు ఉంది. ఇవే ఆయన నాయకత్వానికి శక్తివంతమైన పునాదులు.
వివరాలు
ఆయన ఒక వటవృక్షం
'స్వచ్ఛ భారత్', 'బేటీ బచావో బేటీ పఢావో' వంటి ఉద్యమాలలో ఆరెస్సెస్ కుటుంబం పూర్తిగా కలసికట్టుగా మోహన్ జీ నేతృత్వంలో ముందడుగు వేస్తోంది. సమాజ శ్రేయస్సు కోసం పంచ పరివర్తనలు సాధించాలని సామాజిక సామరస్యం, కుటుంబ విలువల పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, జాతి గౌరవం, పౌర విధుల పాటింపు - ఆయన ఉద్ఘాటించిన ముఖ్యాంశాలు. ఇవన్నీ భారతీయులందరూ పాటించాల్సిన విలువలు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని ఆయన విశ్వసించి, 'ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్' అనే నినాదాన్ని నిత్యం పాటిస్తున్నారు.
వివరాలు
ఆయన ఒక వటవృక్షం
మోహన్ జీ ఎంత బిజీగా ఉన్నా సంగీతం, వాయిద్యాలలో కూడా అభినివేశాన్ని కొనసాగిస్తున్నారు. ప్రసంగాల్లో, సంభాషణల్లో ఆయన పఠనాసక్తి, అవగాహన ప్రతిబింబిస్తుంది. త్వరలో ఆరెస్సెస్ వందవ పడిలో ప్రవేశిస్తుంది. విజయదశమి, గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి ఆరెస్సెస్ శతజయంత్యుత్సవం ఒకేరోజు జరగడం ఆనందదాయకం. వసుధైవ కుటుంబకం భావనకి నిలువెత్తుగా నిలిచే వ్యక్తిగా మోహన్ భాగవత్ జీ నిలవాలి. ఆయన దీర్ఘాయుష్షంతో, చెదరని శక్తి-ఉత్సాహంతో భారత సేవలో యథాశక్తిగా ముందుకు సాగాలని మనసారా కోరుకుంటున్నాం.
వివరాలు
రాజీలేని పయనం
ఆరెస్సెస్ ఆదర్శాలు,సిద్ధాంతాల పరంగా భాగవత్ జీ ఎప్పుడూ రాజీపడకుండా,విపరీత పరిణామాల మధ్య కూడా సంస్థను ముందుకు నడిపారు. యువతను బలంగా ఆకర్షిస్తూ,డిజిటల్ యుగంలోనూ ప్రజలతో సమీపంగా ఉండే మార్గాలను విస్తరించారు. యూనిఫాం మొదలుకొని శిక్షణ శిబిరాల వరకు సంస్థాగతంగా పలు మార్పులు తీసుకొచ్చి వందేళ్ల ఆరెస్సెస్ యాత్రలో రూపాంతరీకరణకు సారథి అయ్యారు కోవిడ్ కాలంలో సాంప్రదాయ సేవా కార్యక్రమాలు నిర్వహించడం కష్టమైంది కానీ, ఆధునిక సాంకేతికతను వినియోగించి అడ్డంకులను అధిగమించారు. అనేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, వ్యక్తిగత ఆరోగ్యాన్ని పక్కన పెడుతూ ప్రజలకు సేవ అందించడం లో వేలాది కార్యకర్తలు పాల్గొన్నారు. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అంతేకాకుండా స్వయంసేవకుల సంకల్పానికి చిరస్మరణీయ ప్రేరణ ఇచ్చిన వారు మోహన్ భాగవత్ .
వివరాలు
ప్రచారక్ అంటే..
"మోహన్ భాగవత్ తో నాకు బలమైన వ్యక్తిగత అనుబంధం ఉంది. ఆయన తండ్రి మధుకర్ రావు భాగవత్ తో కలిసి నేను పనిచేసాను.నా రచన'జ్యోతి పుంజ్'లో ఆయన గురించి కూడా రాశాను. న్యాయవాదిగా,జాతి నిర్మాణానికి ఆయన శక్తివంతంగా సహకరించారు.గుజరాత్‌లో ఆరెస్సెస్ బలోపేతానికి ముఖ్యపాత్ర పోషించారు.కుమారుడు మోహన్ భాగవత్ భారతదేశ పునరుజ్జీవనానికి అంకితమయ్యేలా ప్రేరేపించారు.1970లలో ప్రచారక్ పదవి స్వీకరించి ఆరెస్సెస్ ఆదర్శాలను ముందుకు తీసుకువచ్చారు. ఈ పదవి అంటే కేవలం కార్యక్రమాలు నిర్వహించడం కాదు.. భారత దేశ అభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేసిన దీక్షాపరుడు అని అర్థం. గత నూరేళ్లుగా వేలాది యువత ఆరెస్సెస్ ఛత్రం కింద అహర్నిశలు దేశ సేవలో తపిస్తున్న విషయం గొప్ప గౌరవం". నరేంద్ర మోదీ, భారత ప్రధాని