Page Loader
RSS: 58 ఏళ్ల తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాలలో పాల్గోవడంపై నిషేధం ఎత్తివేత.. మండిపడిన కాంగ్రెస్ 
ప్రభుత్వ ఉద్యోగులు ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాలలో పాల్గోవడంపై నిషేధం ఎత్తివేత

RSS: 58 ఏళ్ల తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాలలో పాల్గోవడంపై నిషేధం ఎత్తివేత.. మండిపడిన కాంగ్రెస్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 22, 2024
11:35 am

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకలాపాల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులపై ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఐటి విభాగం అధిపతి అమిత్ మాల్వియా కూడా ఆర్డర్ స్క్రీన్‌షాట్‌ను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. 58 సంవత్సరాల క్రితం జారీ చేసిన రాజ్యాంగ విరుద్ధమైన ఆదేశాన్ని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉపసంహరించుకుందని అన్నారు. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. ఈమేరకు హస్తం పార్టీ నేత జైరాం రమేశ్‌ సుదీర్ఘ పోస్టు పెట్టారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 జైరాం రమేశ్‌ చేసిన ట్వీట్