Nagababu: నాగబాబుకు కూటమి ప్రభుత్వంలో కీలక పదవి
ప్రముఖ నటుడు,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వంలో కీలక పదవి వరించిన విషయం తెలిసిందే ఇటీవల,ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయనకు ఏ మంత్రిత్వ శాఖ కేటాయిస్తారనే అంశం రాజకీయ,సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజా సమాచారం ప్రకారం, నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖను అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ శాఖను జనసేన పార్టీ నేత కందుల దుర్గేశ్ నిర్వహిస్తున్నారు. ఈశాఖను నాగబాబుకు అప్పగించడం గురించి కూటమి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.
గనుల శాఖను కూడా నాగబాబుకి ఇవ్వాలని ప్రచారం
దుర్గేశ్ ఈశాఖను నిర్వహిస్తున్న కారణంగా ఆయన నుంచి ఈ శాఖను బదిలీ చేయడం సులభతరం అవుతుందనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. చిత్ర పరిశ్రమకు చెందిన నాగబాబుకు ఈ శాఖను కేటాయించడం ద్వారా, ఇండస్ట్రీ, ప్రభుత్వం మధ్య మంచి సంబంధాలు ఏర్పడతాయని ప్రతిపాదన ఉంది. అలాగే, గనుల శాఖను కూడా నాగబాబుకి ఇవ్వాలని ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై మరొక రెండు నుండి మూడు రోజుల్లో స్పష్టత రాబోవచ్చే అవకాశముంది.