KCR vs SIT: ఎర్రవల్లిలో హడావుడి.. కేసీఆర్ సిట్ నోటీసుపై సస్పెన్స్!
ఈ వార్తాకథనం ఏంటి
ఎర్రవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద రాజకీయంగా హడావుడి నెలకొంది. సిట్ (Special Investigation Team) జారీ చేసిన నోటీసులపై కేసీఆర్ ప్రస్తుతం లోతైన సమాలోచనలు జరుపుతున్నారు. సిట్ విచారణకు ఆయన హాజరవుతారా? లేదా? అన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. కేసీఆర్‌ను ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే విచారించాలని ఆయన వర్గాలు విజ్ఞప్తి చేసినప్పటికీ, సిట్ అధికారులు దాన్ని తిరస్కరించారు. నందినగర్ నివాసానికి రావాల్సిందేనని స్పష్టంగా తెలియజేశారు. దీంతో కేసీఆర్ తదుపరి అడుగు ఏమిటన్న దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. సిట్ నోటీసులపై న్యాయ నిపుణుల సలహా తీసుకున్న అనంతరం కేసీఆర్ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ మరింత పెరిగింది.
Details
తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్
ఇదిలా ఉండగా, నిన్న కేసీఆర్ తన సన్నిహిత నేతలు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, జగదీశ్‌రెడ్డిలతో ఫామ్‌హౌస్‌లో కీలక సమావేశం నిర్వహించారు. నిన్నటి నుంచి కేటీఆర్, హరీష్‌రావు, సంతోష్‌రావులు ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే ఉన్నట్లు సమాచారం. నేడు కూడా బీఆర్ఎస్ కీలక నేతలతో కేసీఆర్ మరోసారి భేటీ కానున్నారు. మరోవైపు, ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్‌లో చేరికల కార్యక్రమం కొనసాగుతోంది. కేటీఆర్ సమక్షంలో నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎర్రవల్లి ఫామ్‌హౌస్ తెలంగాణ రాజకీయాల్లో హాట్‌స్పాట్‌గా మారింది.