
S-400 missile systems: 2026 నాటికి భారతదేశానికి మిగిలిన S-400 క్షిపణి వ్యవస్థలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరిగిన సాయుధ సంఘర్షణలో ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ అత్యుత్తమంగా పనిచేసిందని,మిగిలిన రెండు ఎస్-400 స్క్వాడ్రన్లను భారత్‌కు 2026 చివరినాటికి అందిస్తామని రష్యా రాయబారి కార్యాలయ ఉపాధిపతి రోమన్ బబుష్కిన్ సోమవారం ప్రకటించారు. గతంలో కుదిరిన ఒప్పంద ప్రకారం భారత్‌కు మొత్తం అయిదు ఎస్-400 స్క్వాడ్రన్లను రష్యా సరఫరా చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు మూడు స్క్వాడ్రన్లు భారత్‌కు చేరాయి.
వివరాలు
భారత్, రష్యాల మధ్య కుదిరిన 543 కోట్ల డాలర్ల ఒప్పందం
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, శత్రు దేశాల విమానాలు, క్షిపణులు, డ్రోన్ల వంటి విమానాహిత శక్తులపై అడ్డుగోడగా నిలిచే ఈ రక్షణ వ్యవస్థ అభివృద్ధిలో భారత్-రష్యాల మధ్య సాంకేతిక సహకారం మరింతగా విస్తరించే అవకాశం ఉందని బబుష్కిన్ పేర్కొన్నారు. 2018లో భారత్, రష్యాల మధ్య కుదిరిన 543 కోట్ల డాలర్ల ఒప్పందం మేరకు ఈ ఎస్-400 వ్యవస్థల కొనుగోలు జరిగింది. ఇటీవలి భారత్-పాక్ సరిహద్దు ఉద్రిక్తతల సమయంలో డ్రోన్ల వాడకాన్ని పెద్దఎత్తున చూసినట్లు తెలిపారు. అలాంటి పరిస్థులను ఎదుర్కొన్న అనుభవాన్ని రష్యా భారత్‌తో పంచుకోవడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. అలాగే, రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లవ్రోవ్ త్వరలో భారత్‌ను సందర్శించనున్నారని వెల్లడించారు.