Page Loader
Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కి ఒక్కసారి ఆలూ పూరీ, మూడుసార్లు మామిడిపళ్లు తిన్నారు.. ఈడి ఆరోపణలు తిప్పికొట్టిన లాయర్
అరవింద్ కేజ్రీవాల్‌కి ఒక్కసారి ఆలూ పూరీ, మూడుసార్లు మామిడిపళ్లు తిన్నారు

Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కి ఒక్కసారి ఆలూ పూరీ, మూడుసార్లు మామిడిపళ్లు తిన్నారు.. ఈడి ఆరోపణలు తిప్పికొట్టిన లాయర్

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 19, 2024
05:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా స్వీట్లు, మామిడిపండ్లు,బంగాళదుంపలు, పూరీలు తిన్నారంటూ ఈడీ ఆరోపణలను అభిషేక్ మను సింఘ్వీ ఖండించారు. ఈ సందర్భంగా.. ముఖ్యమంత్రి డైట్‌పై నివేదికను 10లోగా కోర్టులో దాఖలు చేస్తామని జైలు యాజమాన్యం కోర్టులో తెలిపింది. కోర్టులో అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన వాదనలు వినిపించారు. 48 సార్లు ఇంటి నుంచి భోజనం వస్తే కేవలం మూడుసార్లు మాత్రమే కేజ్రీవాల్‌ మామిడిపండ్లు తిన్నారని కోర్టుకు సింఘ్వీ తెలిపారు.

Details 

షుగర్ లేకుండా టీ,షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్లు వాడుతున్న కేజ్రీవాల్ 

ఏప్రిల్ 8 తర్వాత మామిడి పండ్లను తినలేదన్నారు. గ్లైసెమిక్ ఇండెక్స్ 51గా ఉన్న మామిడిలో, 73 ఇండెక్స్‌ ఉన్న వైట్ రైస్, 68 ఇండెక్స్‌ ఉన్న బ్రౌన్ రైస్ కంటే తక్కువ షుగర్‌ ఉంటుందని వివరించారు. అందుకే దానిని ఆహారంగా కూడా అనుమతించారని అన్నారు. మరోవైపు కేజ్రీవాల్‌ షుగర్ లేని స్వీట్లను ఆరుసార్లు తిన్నారని, షుగర్ లేకుండా టీ తాగుతున్నారని కేవలం షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్లు వాడుతున్నారని తెలిపారు. 15 నిమిషాల పాటు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా డాక్టర్‌తో మాట్లాడేందుకు అనుమతించకపోవడానికి కేజ్రీవాల్‌ క్రిమినల్‌ లేదా గ్యాంగ్‌స్టరా? అని సింఘ్వీ ప్రశ్నించారు.