తదుపరి వార్తా కథనం

operation sindoor: భారత క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్-400 సురక్షితం: రక్షణ శాఖ వివరణ
వ్రాసిన వారు
Jayachandra Akuri
May 10, 2025
10:23 am
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్-400పై వస్తున్న అవాస్తవ ప్రచారాలను రక్షణ శాఖ ఖండించింది. పాక్ దీనిని ధ్వంసం చేసిందనే వార్తలు పూర్తిగా నిరాధారమని పేర్కొంది.
ఎస్-400పై వస్తున్న తప్పుడు ప్రచారాలను భారత సైన్యం బలంగా తిరస్కరించింది. ఇదిలా ఉండగా, సరిహద్దుల్లో పాక్ దాడులు కొనసాగుతున్నాయి.
ఇటీవల అమృత్‌సర్ ఖాసా కంటోన్మెంట్‌పై పాక్ డ్రోన్లు ప్రయోగించాయి. అయితే వాటిని సమర్థవంతంగా కూల్చివేసినట్లు భారత సైన్యం తెలిపింది.
పౌరులపై ఇలాంటి దాడులు తీవ్రంగా ఖండించారు. ఎలాంటి దాడులైనా భారత సైన్యం సమర్థవంతంగా ఎదుర్కొంటుందని పేర్కొంది.