PM Modi: కాంగ్రెస్'కి 'సబ్కా సాథ్ సబ్‌కా వికాస్' సాధ్యం కాదు.. రాజ్యసభలో మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
ఈ దేశాన్ని ఎక్కువ కాలం కాంగ్రెస్ పాలించింది. అంతపెద్ద పార్టీ ఒక కుటుంబానికి పరిమితమైంది.
ఈ కారణంగానే "సబ్ కా సాత్, సబ్ కా వికాస్" అనే లక్ష్యాన్ని కాంగ్రెస్ సాధించలేకపోయింది అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు.
గురువారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతున్నప్పుడు ప్రధాని మోదీ ప్రసంగించారు.
వివరాలు
బుజ్జగింపు రాజకీయాలపై ఎక్కువ ప్రాధాన్యం
"దేశానికి ఎదురయ్యే సమస్యలను తెలివిగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. గత పదేళ్లుగా మేము సమర్థమైన పాలన అందిస్తున్నాం. దేశ ప్రజలు మాకు మూడోసారి అవకాశం ఇచ్చారు, దాంతో మా అభివృద్ధి విధానం ప్రజలకు అర్థమైంది. 'సబ్ కా సాత్, సబ్ కా వికాస్' అనే నినాదంతో మేము ముందుకు సాగుతున్నాం. పెద్ద దేశంలో మాకు మూడోసారి అవకాశం దక్కడం అంటే ప్రజలు మా అభివృద్ధి మార్గాన్ని అంగీకరించారు. బుజ్జగింపు రాజకీయాలపై ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు, కానీ ప్రజల కళ్లకు గంతలు కట్టి తమ అధికారాన్ని కాపాడుకున్నారు" అని మోదీ అన్నారు.
వివరాలు
ఎస్సీ, ఎస్టీ వర్గాల బలోపేతం
"మా హయాంలో సమయం మొత్తాన్ని దేశ ప్రగతికి వినియోగించాం. దేశంలోని ప్రతి వ్యక్తికి సంక్షేమం అందించడం మా లక్ష్యం. 'నేషన్ ఫస్ట్' అనేది మా విధానం. దేశ ప్రజలందరికి సేవ చేయడానికి మేము ఇక్కడ ఉన్నాం. అంతపెద్ద పార్టీ ఒక కుటుంబానికి పరిమితమైపోవడం వల్ల, ఆ పార్టీలో 'సబ్ కా సాత్, సబ్ కా వికాస్' సాధ్యంకాదు. పదేళ్లలో, 'సబ్ కా సాత్, సబ్ కా వికాస్' అనే మార్పును గమనించాం. ఎస్సీ, ఎస్టీ వర్గాలను బలోపేతం చేస్తున్నాం. ఓబీసీలకు కాంగ్రెస్ రిజర్వేషన్లు ఇవ్వలేదు."
వివరాలు
మహిళలకు గౌరవం ఇచ్చేందుకు 'నారీశక్తి వందన్'
"భారత వికాస యాత్రలో మహిళల పాత్ర చాలా కీలకంగా ఉంది. మహిళలకు గౌరవం ఇచ్చేందుకు 'నారీశక్తి వందన్'ను అమలు చేసి, కొత్త భవనాన్ని ప్రారంభించాం. బీఆర్ అంబేద్కర్‌ను కాంగ్రెస్ ఎప్పుడూ గౌరవించలేదు. ఆయనను ఓడించడానికి ప్రయత్నించింది. దేశంలో దివ్యాంగుల సంక్షేమానికి మిషన్ మోడ్‌లో పనిచేస్తున్నాం. దివ్యాంగులకు అనేక పథకాలు తీసుకున్నాం. ట్రాన్స్‌జెండర్స్ గౌరవంతో బతకాలని చర్యలు తీసుకున్నాం," అని ప్రధాని మోదీ చెప్పారు.