Page Loader
Mumbai : సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపిన నిందితులు గుజరాత్‌లో అరెస్ట్ 
సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపిన నిందితులు గుజరాత్‌లో అరెస్ట్

Mumbai : సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపిన నిందితులు గుజరాత్‌లో అరెస్ట్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 16, 2024
08:19 am

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసంపై కాల్పులు జరిపిన కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ భారీ విజయం సాధించింది. ఈ ఘటనలో పాల్గొన్న ఇద్దరు నిందితులను గుజరాత్‌లోని భుజ్‌లో పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితులను బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లా మసిహికి చెందిన విక్కీ సాహెబ్ గుప్తా (24), సాగర్ శ్రీజోగేంద్ర పాల్ (21)గా గుర్తించారు. ఈ విషయంపై క్రైమ్ బ్రాంచ్ అధికారిక ప్రకటన ఇస్తూ, 'కాల్పుల తర్వాత ముంబై నుండి పారిపోయిన నిందితులిద్దరినీ గుజరాత్‌లోని భుజ్‌లో అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులిద్దరినీ విచారణ కోసం ముంబైకి తీసుకువస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Details 

సిద్ధూ మూసేవాలా హత్య తర్వాత, సల్మాన్ కి బెదిరింపులు 

ఒక్కరోజులోనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయడంలో క్రైం బ్రాంచ్ విజయం సాధించింది. దీని కోసం క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఘటనా స్థలంలోని పలు సీసీటీవీ ఫుటేజీలను విశ్లేషించి నిందితులను గుర్తించారు. కాల్పులు జరిపిన ఇద్దరు నిందితుల్లో ఒకరిపై దోపిడీ,హత్య మొదలైన అనేక తీవ్రమైన కేసులు నమోదయ్యయి . సల్మాన్‌ఖాన్‌ ఇంటి బయట కాల్పులు జరపడానికి ముందు, అతడిని చంపేస్తామని బెదిరించేవారు. 2022లో పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య తర్వాత, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్‌ను బెదిరించాడు. ఆ తర్వాత అతనికి Y- ప్లస్ భద్రత కల్పించబడింది. గత రెండేళ్లుగా ఫోన్ కాల్స్, ఈమెయిల్స్, చంపుతామని బెదిరింపు లేఖలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ వ్యవహారంపై క్రైమ్ బ్రాంచ్ విచారణ ప్రారంభించింది.