TAMILNADU : ఉదయనిధి స్టాలిన్‌పై పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
తమిళనాడు మంత్రి, డీఎంకే కీలక నేత ఉదయనిధి స్టాలిన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. మంత్రి స్టాలిన్ పై కేసు నమోదును తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. అయినా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ దాఖలైన మరో పిటిషన్‌ను విచారించేందుకు బుధవారం సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉదయనిధి వ్యాఖ్యలు ద్వేషపూరితంగా ఉన్నాయని ఆరోపిస్తూ దిల్లీకి చెందిన న్యాయవాది వినీత్ జిందాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ట్యాగ్ చేసింది. ఈ మేరకు బుధవారం విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధా బోస్, బేల త్రివేదిలతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేయలేదు. గతవారం జారీ చేసిన నోటీసులు నేపథ్యంలో 2 కేసులను కలిపి విచారించనున్నట్లు కోర్టు పేర్కొంది.