HYD Cyber Crime Police: అపరిచితుల నుంచి వచ్చే ఫోన్‌లపై అప్రమత్తంగా ఉండండి.. సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరిక
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అపరిచితుల నుంచి వచ్చే ఫోన్‌కాల్‌లపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మంగళవారం ఒక ప్రకటనలో, ఈ రకమైన ఫోన్‌లపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా +94777 455913, +37127913091, +56322553736, +37052529259, +255901130460 వంటి నంబర్లు వచ్చే పక్షంలో ఫోన్ ఎత్తకూడదని తెలిపారు. ప్రత్యేకంగా +371 (లాత్వియా), +375 (బెలారస్), +381 (సెర్బియా), +563 (లోవా), +370 (లిథువేనియా), +255 (టాంజానియా) వంటి ఇంటర్నేషనల్ కోడ్‌లతో మొదలయ్యే ఫోన్ నంబర్లతో రింగ్ చేసి ఎత్తిన తర్వాత హ్యాంగ్ చేస్తారన్నారు. హ్యాంగ్ చేసిన తరువాత తిరిగి కాల్ చేస్తే, మీ బ్యాంకు, క్రెడిట్ కార్డు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు.
నేరపూరిత కార్యకలాపాలలో ఇరికిస్తారు
అదేవిధంగా, మీరు చి90 లేదా చి09 వంటి నంబర్లను డయల్ చేయమని ఎవరైనా సూచిస్తే, అలా చేయకూడదని సూచించారు. అలా చేస్తే, మీ సిమ్ కార్డుకు అనుమతి లేకుండా యాక్సెస్ చేయడం, మీ ఖర్చుతో కాల్స్ చేయడం లేదా నేరపూరిత కార్యకలాపాలలో మిమ్మల్ని ఇరికించడానికి దారితీస్తుందని పేర్కొన్నారు.