Page Loader
Asaduddin Owaisi :ప్రార్థనా స్థలాల చట్టంపై అసదుద్దీన్ ఒవైసీ దాఖలు చేసిన పిటిషన్‌ విచార‌ణ‌కు సుప్రీం ఓకే
ప్రార్థనా స్థలాల చట్టంపై అసదుద్దీన్ ఒవైసీ దాఖలు చేసిన పిటిషన్‌ విచార‌ణ‌కు సుప్రీం ఓకే

Asaduddin Owaisi :ప్రార్థనా స్థలాల చట్టంపై అసదుద్దీన్ ఒవైసీ దాఖలు చేసిన పిటిషన్‌ విచార‌ణ‌కు సుప్రీం ఓకే

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 02, 2025
04:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

1991 సంవత్సరంలో ప్రారంభమైన ప్రార్థనా స్థలాల చట్టాన్నిమరింత బలంగా అమలు చేయాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టేందుకు అంగీకరించింది. 1947,ఆగస్టు 15వ తేదీని పోల్చి,ఆసమయంలో మత సంబంధమైన స్థలాల విషయంలో అమలులో ఉన్న చట్టాన్ని,దానికి సరిపోలిన విధానాన్ని కొనసాగించాలని ఈ పిటిషన్‌లో పేర్కొనడం జరిగింది. ఈ కేసు విచారణకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా,న్యాయమూర్తి సంజయ్ కుమార్‌లు ఉన్న ధర్మాసనం విచారించడం ప్రారంభించింది. ప్రార్థనా స్థలాలకు సంబంధించిన కేసుల తో సంబంధం ఉన్న పిటిషన్‌ను జోడించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్‌పై ఫిబ్రవరి 17వ తేదీన విచారణ జరగవచ్చని అంచనా వేస్తున్నారు.ఓవైసీ తరపున న్యాయవాది నిజాం పాషా వాదనలు వినిపించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బార్ అండ్ బెంచ్ చేసిన ట్వీట్