LOADING...
Supreme Court: స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఎస్‌ఎల్‌పీపై విచారణకు సుప్రీం నిరాకరణ 
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఎస్‌ఎల్‌పీపై విచారణకు సుప్రీం నిరాకరణ

Supreme Court: స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఎస్‌ఎల్‌పీపై విచారణకు సుప్రీం నిరాకరణ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 16, 2025
03:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల సమస్యపై తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ (SLP)పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ విషయంలో హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున, సుప్రీం కోర్ట్ దీన్ని ప్రస్తుతం తీసుకోలేనని స్పష్టంచేసింది. తన ఆదేశాలతో సంబంధం లేకుండా, హైకోర్ట్ తదుపరి విచారణను మెరిట్స్ ఆధారంగా జరపాలని సూచించింది. పాత రిజర్వేషన్ల ఆధారంగా స్థానిక ఎన్నికలు నిర్వహించవచ్చని కూడా పేర్కొంది.

వివరాలు 

హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ 

గతంలో, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీఓ 9పై హైకోర్టు విధించిన మధ్యంతర స్టేను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్ట్‌లో SLP దాఖలు చేయడం తెలిసిందే. హైకోర్ట్ ఈ నెల 9న జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 13వ తేదీన పిటిషన్ సమర్పించింది. అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో, 16, 17వ తేదీల్లో ఏదో ఒకరోజు ఈ కేసు పై విచారణ జరగాలని మంగళవారం సుప్రీం కోర్ట్ రిజిస్ట్రార్‌ ముందు మెన్షన్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లుగానే, రిజిస్ట్రీ ఈ కేసును నేటి విచారణ జాబితాలో చేర్చింది. కానీ, సుప్రీం కోర్ట్ దీన్ని విచారించడానికి నిరాకరించింది.