LOADING...
Supreme Court: రాష్ట్రపతి,గవర్నర్లకు బిల్లులపై గడువు విధించడం తగదు:  సుప్రీంకోర్టు కీలక తీర్పు 
సుప్రీంకోర్టు కీలక తీర్పు

Supreme Court: రాష్ట్రపతి,గవర్నర్లకు బిల్లులపై గడువు విధించడం తగదు:  సుప్రీంకోర్టు కీలక తీర్పు 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2025
11:36 am

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్ర శాసనసభలు ఆమోదించి రాష్ట్రపతి లేదా గవర్నర్లకు పంపించే బిల్లులపై సమ్మతి తెలిపే ప్రక్రియకు కోర్టు గడువు విధించవచ్చా?.. అన్న విషయంపై దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము పంపిన ప్రెసిడెన్షియల్‌ రిఫరెన్స్‌ను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం పరిశీలించి కీలక తీర్పును వెల్లడించింది. పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఆమోదించేందుకు లేదా నిర్ణయించేందుకు రాష్ట్రపతి, గవర్నర్లకు ఒక నిర్దిష్ట గడువును నిర్ణయించడం సరైంది కాదని కోర్టు చెప్పింది. అయితే, గవర్నర్లు ఎలాంటి కారణం చెప్పకుండా బిల్లులను తిరిగి పంపే అధికారం తమకు లేదని స్పష్టంచేసింది. గవర్నర్లు అధికారాలను పరిమితుల్లేకుండా వినియోగించే అవకాశం లేదని, ఆర్టికల్‌ 200 ప్రకారం వారికి కొన్ని సందర్భాల్లో మాత్రమే విచక్షణా హక్కు ఉంటుందని ధర్మాసనం వివరించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 'బిల్లుల' అంశంపై సుప్రీం కీలక తీర్పు