LOADING...
CJI: న్యాయ సంస్కరణల పిటిషన్‌పై సుప్రీంకోర్టు అసహనం
న్యాయ సంస్కరణల పిటిషన్‌పై సుప్రీంకోర్టు అసహనం

CJI: న్యాయ సంస్కరణల పిటిషన్‌పై సుప్రీంకోర్టు అసహనం

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 19, 2026
02:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

న్యాయ సంస్కరణలపై దాఖలైన ఒక పిటిషన్‌ను పరిశీలించిన సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించేందుకు కోర్టు నిరాకరించింది. న్యాయవ్యవస్థలో సంస్కరణలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, అలాగే ప్రతి కేసు 12 నెలల్లోగా పరిష్కారం అయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు.

వివరాలు 

కోర్టు పిటిషన్లు వేయడం సరైంది కాదు 

ఈ అంశంపై స్పందించిన సీజేఐ.. న్యాయ సంస్కరణల పేరుతో కోర్టులను ఆశ్రయించడం అవసరం లేదని స్పష్టం చేశారు. దేశంలో మార్పులు తీసుకురావాలనుకుంటే పిటిషన్లు వేయాల్సిన పని లేదని, సూచనలు లేదా సలహాలు ఉంటే నేరుగా లేఖ రూపంలో పంపించాలని తెలిపారు. వాటిని అమలు చేయగలమా లేదా అన్నది పరిశీలిస్తామని అన్నారు. కెమెరాల ముందు మాట్లాడటానికో, ప్రచారం కోసం కోర్టు పిటిషన్లు వేయడం సరైంది కాదని హెచ్చరించారు. అలాగే ప్రతి కేసు 12 నెలల్లో తప్పనిసరిగా పరిష్కరించాలన్న డిమాండ్‌పై ప్రశ్నిస్తూ.. అలాంటి పరిస్థితుల్లో కోర్టులు ఎన్ని కావాలి..? అవి ఎక్కడి నుంచి వస్తాయి..?'' అని వ్యాఖ్యానించారు.

Advertisement