NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Air Quality: పంట వ్యర్థాలను కాల్చడం విషయంలో.. ఎయిర్‌ క్వాలిటీ కమిషన్‌పై సుప్రీం ఆగ్రహం
    తదుపరి వార్తా కథనం
    Air Quality: పంట వ్యర్థాలను కాల్చడం విషయంలో.. ఎయిర్‌ క్వాలిటీ కమిషన్‌పై సుప్రీం ఆగ్రహం
    ఎయిర్‌ క్వాలిటీ కమిషన్‌పై సుప్రీం ఆగ్రహం

    Air Quality: పంట వ్యర్థాలను కాల్చడం విషయంలో.. ఎయిర్‌ క్వాలిటీ కమిషన్‌పై సుప్రీం ఆగ్రహం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 27, 2024
    04:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశ రాజధానిలో గాలి కాలుష్యాన్ని అరికట్టడంలో ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కమిషన్‌ (CAQM) విఫలమవడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.

    గాలి నాణ్యత పర్యవేక్షణ, వాయు కాలుష్య నియంత్రణకు కావలసిన చర్యలు తీసుకోకపోవడంపై కోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

    పంట వ్యర్థాలను కాల్చడం విషయంలో ఎటువంటి కమిటీలు ఏర్పాటు చేయలేదని, గతంలో కమిషన్‌ తెలిపిన సూచనలు గాల్లో వినిపిస్తున్న మాటలే అని పేర్కొంది.

    ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణలో మరింత చురుకుగా వ్యవహరించాలని కమిషన్‌కి సూచించింది.

    వివరాలు 

     గతంలో చెప్పిన సూచనలు గాల్లో మాటలుగా మిగిలిపోయాయి: సుప్రీం

    "పంట వ్యర్థాల సమస్యను పరిష్కరించడానికి కనీసం ఒక్క కమిటీ కూడా ఏర్పాటు చేయలేదు. ప్రతి సంవత్సరం ఈ సమస్యను పరిశీలిస్తున్నప్పుడు, సీఏక్యూఎం చట్టం అమలు కావడం లేదని స్పష్టం అవుతోంది. మీరు కమిటీలు ఏర్పాటు చేశారా? చట్ట ప్రకారం తీసుకున్న చర్యలను కనీసం ఒకటి చూపించండి. దిల్లీ ఎన్‌సీఆర్‌ రాష్ట్రాలకు గతంలో చెప్పిన సూచనలు గాల్లో మాటలుగా మిగిలిపోయాయని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. మీరు కేవలం మౌన ప్రేక్షకులుగా మిగిలిపోయారని మందలించింది.

    వివరాలు 

     సమగ్ర నివేదికను అందజేయాలని సీఏక్యూఎంను సుప్రీం కోర్టు ఆదేశం 

    సీఏక్యూఎం ఛైర్‌పర్సన్‌ స్పందిస్తూ, గాలి కాలుష్యాన్ని కట్టడేందుకు మూడు సబ్‌ కమిటీలు ఏర్పాటు చేశామని, ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశాలు జరుగుతున్నాయని తెలిపారు.

    దీనిపై స్పందించిన ధర్మాసనం, అరుదుగా జరిగే అలాంటి సమావేశాలతో ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నారో అర్థమవుతుందని ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

    పంట వ్యర్థాలకు ప్రత్యామ్నాయాలను అమలు చేసేందుకు కృషి చేయాలని, ఆ చర్యలపై సమగ్ర నివేదికను సమర్పించాలని సుప్రీం కోర్టు సీఏక్యూఎం కు ఆదేశించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    సుప్రీంకోర్టు

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    దిల్లీ

    Air India: ఢాకాకు ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం.. ఢాకా నుండి ఢిల్లీకి  205 మంది  ఎయిర్ ఇండియా
    Delhi: బిల్డింగ్ బైలాస్ ఉల్లంఘించినందుకు ఢిల్లీలోని 10 కోచింగ్ సెంటర్ల బేస్‌మెంట్లు సీజ్  భారతదేశం
    World War 2-era condition: అరుదైన వ్యాధితో బాధపడుతున్నUPSC విద్యార్థి భారతదేశం
    UP: బరేలీలో 9 మంది మహిళలను హత్య చేసిన సీరియల్ కిల్లర్..? ఉత్తర్‌ప్రదేశ్

    సుప్రీంకోర్టు

    NEET re-exam: నేడు నీట్ రీ-ఎగ్జామ్ పిటిషన్లను విచారించనున్న సీజేఐ నేతృత్వంలోని ఎస్సీ బెంచ్  నీట్ స్కామ్ 2024
    SC on Disability:చలనచిత్రాలలో వికలాంగుల చిత్రీకరణపై సుప్రీం మార్గదర్శకాలు  భారతదేశం
    Supreme Court: సీబీఐ కేసులో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ పిటిషన్‌.. విచారించనున్న సుప్రీంకోర్టు  భారతదేశం
    Supreme Court: సుప్రీం కీలక తీర్పు.. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు భరణానికి అర్హులు తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025