తదుపరి వార్తా కథనం

Teachers recruitment Scam: దీదీ సర్కారుకు సుప్రీం షాక్.. ఆ 25వేల ఉపాధ్యాయుల నియామకాలు రద్దు
వ్రాసిన వారు
Sirish Praharaju
Apr 03, 2025
11:33 am
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్ రాజకీయాలను కుదిపేసిన ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది.
ఈ వ్యవహారానికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై దర్యాప్తు జరిపిన అత్యున్నత న్యాయస్థానం గురువారం కీలక తీర్పు వెలువరించింది.
అవకతవకల ఆరోపణలు ఎదుర్కొంటున్న 25,000 మంది ఉపాధ్యాయుల నియామకాలు చెల్లవని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
గతంలో కలకత్తా హైకోర్టు ఈ నియామకాలను రద్దు చేసిన తీర్పును సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం సమర్థించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆ 25వేల టీచర్ల నియామకాలు రద్దు
#Breaking | Bengal teachers recruitment scam
— TIMES NOW (@TimesNow) April 3, 2025
- SC upholds Calcutta HC order
It is a matter of shame for the ruling govt in W.B...: @impriyankabjp tells @anchoramitaw
@RittickMondal reports from the ground. pic.twitter.com/BFYMV5IxyW