Page Loader
MLC Elections: ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల
ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

MLC Elections: ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 29, 2025
01:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ప్రతీ రాష్ట్రంలో మూడు చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఫిబ్రవరి 3న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. పోలింగ్‌ 27వ తేదీన జరగనుండగా, మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

Details

ఫిబ్రవరి 3న నోటిఫికేషన్

అలాగే, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ స్థానాలపై పోలింగ్‌ జరగనుంది. తెలంగాణలో మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. ఇంకా, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి కూడా ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ విడుదలైంది.