Page Loader
Narendra Modi: ప్రధాని మోదీకి రాఖీ కట్టిన విద్యార్థులు 
ప్రధాని మోదీకి రాఖీ కట్టిన విద్యార్థులు

Narendra Modi: ప్రధాని మోదీకి రాఖీ కట్టిన విద్యార్థులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 19, 2024
01:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన అధికారిక నివాసంలో పాఠశాల చిన్నారులు ఆయనకు రాఖీ కట్టారు. ప్రధాని మోదీ, ఆయన తల్లి హీరాబెన్‌ల చిత్రాలతో ఉన్న ఓ రాఖీని ఓ బాలిక ఆయనకి కట్టింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రధాని మోదీకి రాఖీ కట్టిన చిన్నారులు

వివరాలు 

రాఖీ పండుగను పురస్కరించుకొని దేశ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు

అంతకుముందు రాఖీ పండుగను పురస్కరించుకొని దేశ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ''సోదరసోదరీమణుల మధ్య అపరిమిత ప్రేమకు ప్రతీక ఈ రక్షా బంధన్‌. ఈ పండుగ మీ బంధాలను మరింత తీపికరంగా చేయాలని, ఆప్యాయత, సామరస్య భావాలను బలోపేతం చేయాలని, ప్రజలంతా ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా'' అంటూ పోస్టు చేశారు.