Tamilnadu Heavy rains: తమిళనాడులో భారీ వర్షాలు.. 4 జిల్లాల్లో పాఠశాలలు మూసివేత
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఉందని సోమవారం వార్తా సంస్థ ANI నివేదించింది. భారీ వర్షాల కారణంగా తూత్తుకుడి జిల్లాలోని పలు వీధులు మునిగిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో తిరునెల్వేలి,తూత్తుకుడి,కన్యాకుమారి,టెన్'కాశి జిల్లాల్లోని అన్ని పాఠశాలలు,కళాశాలలు,ప్రైవేట్ సంస్థలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు తమిళనాడు ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. భారీ వర్షాలు, నీటి ఎద్దడి పరిస్థితులపై రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ మంత్రి కేకేఎస్‌ఎస్‌ఆర్ రామచంద్రన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పలు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టిందని, పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర విపత్తు నివారణ దళాలు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలను తిరునెల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి, టెన్'కాశి జిల్లాలలో మోహరించినట్లు తెలిపారు.
భారీ వర్షాల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం పలు ముందస్తు జాగ్రత్తలు
తమిళనాడు ప్రభుత్వం పలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. ముందుజాగ్రత్త చర్యగా తిరునెల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి, టెన్'కాశి జిల్లాల్లో 250 రాష్ట్ర విపత్తు రెస్పాన్స్ ఫోర్స్‌లు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌లను మోహరించారు. తిరునల్వేలి జిల్లాలో 19 శిబిరాలు, కన్యాకుమారి జిల్లాలో 4 శిబిరాలు, తూత్తుకుడి జిల్లాలో 2 శిబిరాలు, టెన్'కాశి జిల్లాలో 1 శిబిరాన్ని విపత్తుల సమయంలో ప్రజలకు వసతి కల్పించేందుకు ఏర్పాటు చేశారు. అక్కడే ఉండి ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారని రామచంద్రన్ ఉటంకిస్తూ ANI నివేదించంది.
జలమయమైన విధులు
తూత్తుకుడి జిల్లాలో రాత్రి వర్షం కొనసాగింది. కోవిల్‌పట్టిలోని 40 సరస్సులు పూర్తి స్థాయికి చేరుకున్నాయి. IMD ప్రకారం, కన్యాకుమారి, తిరునల్వేలి,తూత్తుకుడిలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తిరునెల్వేలిలోని సెల్వీ నగర్, సిందుపూండురై నివాస ప్రాంతాల్లోని వీధులు జలమయమయ్యాయి.