Page Loader
తెలంగాణలో పునఃప్రారంభమైన పాఠశాలలు.. 41 వేల స్కూళ్లు, గురుకులాల రీ ఓపెన్
తెలంగాణలో పున ప్రారంభమైన 41 వేల స్కూళ్లు, గురుకులాలు

తెలంగాణలో పునఃప్రారంభమైన పాఠశాలలు.. 41 వేల స్కూళ్లు, గురుకులాల రీ ఓపెన్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 12, 2023
09:58 am

ఈ వార్తాకథనం ఏంటి

విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన వేసవి సెలవులు నేటితో ముగిశాయి. దాదాపు 45 రోజుల విరామం తర్వాత బడి గంటలు మోగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 41 వేల పాఠశాలలు, గురుకులాలు, వసతిగృహాలు సోమవారం నుంచి తిరిగి తెరుచుకున్నాయి. ఫలితంగా 60 లక్షల మంది అన్ని రకాల విద్యార్థులు తిరిగి బడిబాటపట్టారు. అయితే సర్కారు బడులను మరింత బలోపేతం చేసి విద్యా ప్రమాణాలను మెరుపర్చేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. కొత్త అకాడమిక్ ఇయర్ లో చేపట్టే కార్యక్రమాలతో పాఠశాల విద్య, సమగ్ర శిక్ష, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ (ఎస్ఐటీ)లకు వేర్వేరు ప్రణాళికలను విద్యాశాఖ అధికారులు రూపొందించారు.

DETAILS

ఉపాధ్యాయులకు 5 వారాల పాటు ప్రత్యేక శిక్షణ : పాఠశాల విద్యాశాఖ

శాఖాపరమైన ఆమోదం కోసం ఆయా ప్రతిపాదనలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు సమర్పించారు. ఈసారి తొమ్మిగో తరగతికీ ఇంగ్లీష్ మీడియాన్ని పర్తింపజేయనున్న పాఠశాల విద్యాశాఖ, ఇప్పటికే 1 - 8 తరగతుల్లో ఆంగ్ల మాధ్యమ బోధన కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో హ్యాకథాన్స్‌, పోటీలను సైతం నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఐవోటీ - ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ ఏఐ - ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఎంఎల్‌ - మెషీన్‌ లెర్నింగ్‌ లాంటి అత్యాధునిక సాంకేతికత అంశాలపై పాఠశాల అభివృద్ధిలో భాగంగా స్పెషల్ ప్లాన్‌ను అమలు చేయనున్నామని వెల్లడించింది. ఇంగ్లిష్‌ మీడియంలో బోధించేందుకు ఉపాధ్యాయులకు మరో 5 వారాల పాటు ప్రత్యేక శిక్షణ అందిస్తామని స్పష్టం చేసింది.