Hyderabad: గచ్చిబౌలిలో 20 కేజీల గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్ నగరంలో మాదకద్రవ్యాల వ్యాపారం నిరంతరం పెరుగుతూనే ఉంది. గంజాయి విక్రయించే గ్యాంగులు నగరంలో యథేచ్చగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. కొంతమంది గంజాయి, డ్రగ్స్ కొనుగోలు చేయాలంటే, ఫోన్ ద్వారా ఆర్డర్ చేస్తున్నారు. ఇలాంటి తరహా మాదకద్రవ్యాల గ్యాంగులపై పోలీసులు సీరియస్‌గా చర్యలు తీసుకుంటున్నా, నగరంలో మాదకద్రవ్యాల తరలింపు కొనసాగుతోంది. తాజాగా గచ్చిబౌలిలో శంషాబాద్ డిటిఎఫ్(డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్) అధికారుల ఆధ్వర్యంలో భారీగా గంజాయి లభ్యమైంది
పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు
గచ్చిబౌలిలోని నానక్‌రామ్ గూడా ప్రాంతంలో, ఒక కారులో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అధికారులు పట్టుకున్నారు. 20 కేజీల గంజాయి ప్యాకెట్లను డిక్కీలో రహస్యంగా తరలిస్తుండగా, 13 డ్రై గంజాయి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ సరఫరా విషయంలో ఒరిస్సా రాష్ట్రంలోని మాల్కన్‌గిరి జిల్లాకు చెందిన బిక్రం హిరా(24) ప్రధాన నిందితుడిగా గుర్తించారు. అయితే అతను పోలీసుల నుంచి తప్పించుకోగా, మరో ముగ్గురిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇక గంజాయి తరలించిన కారును సీజ్ చేశారు.