LOADING...
Semicon 2024: ఇండియన్ మేడ్ చిప్ మా కల.. సెమికాన్ 2024 కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ 
ఇండియన్ మేడ్ చిప్ మా కల.. సెమికాన్ 2024 కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ

Semicon 2024: ఇండియన్ మేడ్ చిప్ మా కల.. సెమికాన్ 2024 కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 11, 2024
03:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించిన దాని ప్రకారం,ప్రపంచవ్యాప్తంగా ప్రతి పరికరంలో ఇండియా తయారు చేసిన చిప్ ఉండాలనేది ఆయన కల. భారత్‌లో ఎప్పటికీ చిప్‌ల కొరత ఉండదని ఆయన భరోసా ఇచ్చారు. దిల్లీలో జరిగిన'సెమికాన్ 2024 కాన్ఫరెన్స్'లో మోదీ సెమికండక్టర్ పరిశ్రమకు చెందిన కంపెనీల ప్రతినిధులు,నిపుణులతో ప్రసంగించారు.ఈసందర్భంలో వారు భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని మోదీ కోరారు. ''ప్రతి పరికరంలో భారతీయ చిప్ ఉండాలని మా కల.భారత్‌ను సెమికండక్టర్ పరిశ్రమలో శక్తివంతమైన కేంద్రంగా మార్చడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం.ప్రస్తుతం భారతదేశానికి త్రీ డైమెన్షనల్ పవర్ ఉంది.ఆ మూడు సంస్కరణలకు అనుకూలమైన ప్రభుత్వం, తయారీకి అనుకూల వాతావరణం,ఆశాజనకమైన మార్కెట్. ఇలాంటి టెక్నాలజీ రుచి ఉన్న మార్కెట్ మరోచోట దొరకడం అసాధ్యం''అని మోదీ తెలిపారు.

వివరాలు 

భారత చిప్ పరిశ్రమకు ప్రత్యేక డయోడ్లు

''ఎలాంటి సంక్షోభం వచ్చినా నిలబడగల సరఫరా గొలుసు అత్యవసరం. భారత్ దీనిని నిర్మించడానికి కృషి చేస్తోంది.కొవిడ్ సమయంలో ఈ సమస్యలను ఎదుర్కొన్నారు. మీరు భారత్‌లో పెట్టుబడులు పెడితే 21వ శతాబ్దంలో చిప్స్ కొరత ఎదురుకాదు. డయోడ్ ఒక దిశలో శక్తిని తీసుకెళ్తుంది, కానీ భారత చిప్ పరిశ్రమకు ప్రత్యేక డయోడ్లు ఉన్నాయి. వాటికి రెండు దిశల్లో శక్తి ప్రసారమవుతుంది. పెట్టుబడులు పెట్టి మీ విలువను సృష్టించుకోండి. సుస్థిర విధానాలు, సులభమైన వ్యాపార ప్రక్రియలను మేము మీకు అందిస్తాం'' అని మోదీ హామీ ఇచ్చారు.

వివరాలు 

సెమీకండక్టర్ల తయారీకి ప్రత్యామ్నాయంగా భారత్‌

కరోనా వైరస్ పుట్టుకైన చైనాలో కఠిన ఆంక్షలు అమలుచేయడం వల్ల ఆ దేశంపై ఆధారపడిన ఇతర దేశాలు ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. సెమికండక్టర్ పరిశ్రమ కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంది. ఇప్పుడు అనేక దేశాలు సెమీకండక్టర్ల తయారీకి ప్రత్యామ్నాయంగా భారత్‌వైపు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం దక్కించుకున్నాయి.