Page Loader
ఫేస్‌బుక్ ప్రేమాయం: యూపీ యువకుడిని పెళ్లాడిన బంగ్లాదేశ్‌ మహిళ; ఆ తర్వాత ట్విస్ట్ ఏంటంటే!
ఫేస్‌బుక్ ప్రేమాయం: యూపీ యువకుడిని పెళ్లాడిన బంగ్లాదేశ్‌ మహిళ; ఆ తర్వాత ట్విస్ట్ ఏంటంటే!

ఫేస్‌బుక్ ప్రేమాయం: యూపీ యువకుడిని పెళ్లాడిన బంగ్లాదేశ్‌ మహిళ; ఆ తర్వాత ట్విస్ట్ ఏంటంటే!

వ్రాసిన వారు Stalin
Jul 19, 2023
12:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థా‌న్‌కు చెందిన సీమ హైదర్ తరహాలో ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో కేసు తెరపైకి వచ్చింది. బంగ్లాదేశ్‌కు చెందిన మహిళ ఫేస్‌ బుక్‌లో పరిచయమైన తన ప్రేమికుడిని పెళ్లి చేసుకోవడానికి ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు వచ్చింది. తన పేరు జూలీ అని చెప్పి, ఫేస్‌బుక్‌లో పరిచయమైన అజయ్‌ను హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంది. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. పెళ్లైన కొద్ది రోజుల తర్వాత వీసా రెన్యువల్‌చేయించుకునే పని ఉందని చెప్పి, అజయ్‌ని జూలీ తనతో పాటు బంగ్లాదేశ్ సరిహద్దుకు తీసుకెళ్లింది. వీరు సరిహద్దుకు వెళ్లిన రెండు నెలల తర్వాత అజయ్‌రక్తంతో ఉన్న ఫొటోలను యూపీలోని అత్తగారికి జూలీ పంపింది. దీంతో హడలెత్తిపోయిన అజయ్ తల్లి పోలీసులను ఆశ్రయించింది.

యూపీ

నా కుమారుడిని ఇండియాకు తీసుకురావాలి: అజయ్ తల్లి

జూలీ తన 11ఏళ్ల కూతురు హలీమాతో కలిసి మొరాదాబాద్ వచ్చి హిందూ మతంలోకి మారి అజయ్‌ను వివాహం చేసుకుందని పోలీసులకు చేసిన ఫిర్యాదులో అజయ్ తల్లి సునీత పేర్కొంది. వీసా గడువును పొడిగించుకునేందుకు బంగ్లాదేశ్ సరిహద్దుకు తన కొడుకును జూలీ తీసుకెళ్లిందని వివరించింది. ఆ తర్వాత అజయ్ తనకు ఫోన్ చేసి తాము పొరపాటున బంగ్లాదేశ్ సరిహద్దులోకి వెళ్లామని మరో 10-15రోజుల్లో తిరిగి వస్తామని చెప్పినట్లు పేర్కొంది. ఇది జరిగి రెండు నెలలు అవుతోందని ఫిర్యాదులో రాసుకొచ్చింది. తాజాగా అదే ఫోన్‌నంబర్ నుంచి తన కొడుకు రక్తంతో తడిసిన ఫోటోలను పంపారని, జూలీ అజయ్‌ని ఏదో చేసి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. తన కుమారుడిని ఇండియాకు రప్పించాలని ఎస్ఎస్‌పీ ఫిర్యాదు చేసింది.