Page Loader
LK Advani: క్షీణించిన ఎల్‌కే అద్వానీ ఆరోగ్యం.. ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో చేరిక 
క్షీణించిన ఎల్‌కే అద్వానీ ఆరోగ్యం.. ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో చేరిక

LK Advani: క్షీణించిన ఎల్‌కే అద్వానీ ఆరోగ్యం.. ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో చేరిక 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 06, 2024
03:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, భారత మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ ఈ ఉదయం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయనను ఇంద్రప్రస్థలోని అపోలో ఆసుపత్రిలోని న్యూరాలజీ విభాగంలో చేర్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని,వైద్యుల బృందం ఆయన్ను పర్యవేక్షిస్తోందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 96ఏళ్ల అద్వానీ వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.కొద్ది రోజుల క్రితం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు. అద్వానీకి ఈఏడాది దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది. అద్వానీ ఆరోగ్యం కారణంగా రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరు కాలేదు. అందుకే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మార్చి 30న ఆయన నివాసానికి వెళ్లి భారతరత్నతో సత్కరించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో చేరిన ఎల్‌కే అద్వానీ