Muddada Ravichandra: ఏపీ సీఎం కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర నియామకం
ఈ వార్తాకథనం ఏంటి
సీనియర్ ఐఎఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రను రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యదర్శిగా నియమించింది.
రవిచంద్ర తన కొత్త బాధ్యతలను తక్షణం అమలులోకి తీసుకురావాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
పరిపాలనా రంగంలో అనుభవ సంపన్నుడైన రవిచంద్ర తన నైపుణ్యాన్ని భూమికకు చేర్చి రాష్ట్ర అభివృద్ధి,ప్రగతికి కృషి చేయాలని భావిస్తున్నారు.
వివిధ సవాళ్లు,అవకాశాలకోసం ప్రయత్నం చేయగలరని భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు ఆయన నియామకం కీలక సమయంలో జరిగింది.పెట్టుబడుల సాధన,పాలనను సమర్ధవంతంగా నిర్వహించడానికి నిజాయితీగా పనిచేసే అధికారులు కూటమి ప్రభుత్వానికి అవసరం.
ఓపక్క భాగస్వామ్య పక్షాల డిమాండ్లు తీరుస్తునే పాలన గాడి తప్పకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రితో పాటు ఆయన కార్యదర్శిపై వుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సీఎం ముఖ్య కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర నియామకం
సీఎం ముఖ్య కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర నియామకం.
— Narendra G (@Narendra4JSP) June 12, 2024
రవిచంద్ర నియామకంపై ఉత్తర్వులు జారీ. pic.twitter.com/cLoGmM9KR5