Page Loader
NSG New Chief: ఎన్‌ఎస్‌జీ చీఫ్‌గా సీనియర్ ఐపీఎస్ బీ శ్రీనివాసన్ నియామకం
ఎన్‌ఎస్‌జీ చీఫ్‌గా సీనియర్ ఐపీఎస్ బీ శ్రీనివాసన్ నియామకం

NSG New Chief: ఎన్‌ఎస్‌జీ చీఫ్‌గా సీనియర్ ఐపీఎస్ బీ శ్రీనివాసన్ నియామకం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 28, 2024
08:24 am

ఈ వార్తాకథనం ఏంటి

నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జి) డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపిఎస్ అధికారి బి శ్రీనివాసన్ మంగళవారం నియమితులయ్యారు. శ్రీనివాసన్ 1992బ్యాచ్ బీహార్ కేడర్ ఐపీఎస్ అధికారి. క్యాబినెట్ నియామకాల కమిటీ ఆగస్టు 31, 2027 వరకు, అంటే అయన పదవీ విరమణ తేదీ వరకు నియామకానికి ఆమోదం తెలిపిందని సిబ్బంది మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఆయన రాజ్‌గిర్‌లోని బీహార్ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. జమ్ముకశ్మీర్ పోలీస్ కొత్త చీఫ్‌గా నళిన్ ప్రభాత్ నియమితులైన తర్వాత NSG డైరెక్టర్ జనరల్ పదవి ఖాళీగా ఉంది. ఆగస్టు 31, 2028 (అయన పదవీ విరమణ తేదీ)వరకు పదవీకాలం కోసం ఈ ఏడాది ఏప్రిల్‌లో నలిన్ ప్రభాత్ NSG చీఫ్‌గా నియమితులయ్యారు.

వివరాలు 

సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ అనిష్ దయాల్ సింగ్‌కు ఎన్ఎస్‌జీ అదనపు బాధ్యతలు

అయితే ఆయన పదవీకాలాన్ని ఆగస్టు 15న కేంద్రం కుదించింది. ఆయన జమ్మూ కశ్మీర్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా నియమించబడ్డారు. అనంతరం సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ అనిష్ దయాల్ సింగ్‌కు ఎన్ఎస్‌జీ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో, శ్రీనివాసన్‌ను కేంద్ర ప్రభుత్వం కొత్త డీజీగా నియమించింది.