
Jyoti Malhotra: విచారణలో సంచలన నిజాలు.. 'ఐఎస్‌ఐ' ఎరగా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా?
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసిన కేసులో అరెస్టయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ భారతదేశంలో అండర్‌కవర్ ఏజెంట్లను గుర్తించేందుకు ఆమెను వినియోగించినట్లు సమాచారం.
ఈమేరకు జ్యోతి ఐఎస్‌ఐ హ్యాండ్లర్లతో కోడ్ భాషలో సంభాషించినట్లు దర్యాప్తు అధికారులకు నిగ్గెత్తినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ కొన్ని ఆంగ్ల మీడియాలో ఈ విషయాలు వెలువడ్డాయి.
జ్యోతి మల్హోత్రా, ఐఎస్‌ఐ హ్యాండ్లర్ అలీ హసన్ మధ్య వాట్సప్ చాటింగ్ ఆధారాలు దర్యాప్తులో బయటపడ్డాయి.
Details
కోడ్ భాషలో సంభాషణ
ఈ చాటింగ్‌లో భారత అండర్‌కవర్ ఆపరేషన్లపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఒక సందేశంలో హసన్, "అటారీ సరిహద్దు వద్ద ఎవరైనా ప్రోటోకాల్ పొందారా?" అని అడిగినట్లు గుర్తించారు.
దానికి జ్యోతి "లేదు.. అలాంటి ప్రోటోకాల్ ఎవరికి కనిపించలేదు" అని సమాధానమిచ్చినట్లు చెబుతున్నారు.
ఇంతటితో ఆగకుండా హసన్, "ఎవరు ప్రోటోకాల్ పొందుతున్నారో గమనించు.. అండర్‌కవర్ ఏజెంట్లను గుర్తించడానికి అదే మార్గం," అని చెప్పినట్లు సమాచారం.
జ్యోతి స్పందనలో, "వారంతా తెలివితక్కువ వాళ్లేం కాదు," అని పేర్కొంది. ఈ సంభాషణలు కోడ్ భాషలో ఉండటంతో, దర్యాప్తు సంస్థలు ఎన్‌క్రిప్ట్ చేసిన డేటాను డీకోడ్ చేసి వివరాలను వెలికి తీశారు.
Details
విచారిస్తున్న అధికారులు
ప్రస్తుతం జ్యోతి మల్హోత్రా ఉద్దేశపూర్వకంగా భారత నిఘా సమాచారాన్ని పాక్ ఐఎస్‌ఐకి అందించాలనుకున్నదా? లేక ఆమెను ఎవరైనా మభ్యపెట్టి ఈ పనికి ఉపయోగించుకున్నారా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా, జ్యోతి 2023లో వైశాఖి పండుగ సందర్భంగా తొలిసారి పాకిస్థాన్ వెళ్లింది.
అక్కడ ఆమెకు పాక్ హైకమిషన్ అధికారి డానిష్‌తో పరిచయం ఏర్పడింది. అయితే, ఆ పరిచయాన్ని ఆమె తనకు ఏమి తెలియనట్లుగా, అసంపూర్ణంగా సమాధానాలు ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం జ్యోతిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారులు విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.