
Gandikota Murder Case: గండికోట మైనర్ హత్య కేసులో సంచలన ట్విస్ట్.. మూడు నెలలుగా రెక్కీ?
ఈ వార్తాకథనం ఏంటి
కడప జిల్లాలోని గండికోటలో మైనర్ బాలిక దారుణ హత్య కేసులో కీలక మలుపు వెలుగులోకి వచ్చింది. ఈ హత్య యాదృచ్ఛికంగా కాకుండా ప్రీ-ప్లాన్ ప్రకారం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. బాలిక ప్రియుడు లేదా కుటుంబసభ్యులు కాకుండా ఈ కేసులో మరెవరైనా పాత్రధారులున్నారా అనే అనుమానాల నేపథ్యంలో నూతన కోణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. విధివిధాలుగా సమగ్ర సమాచారం సేకరించిన పోలీసులు.. గత మూడుమాసాలుగా బాలికపై రెక్కీ జరిగినట్టు ఆధారాలు లభ్యమయ్యాయని అనుమానిస్తున్నారు. అంతేకాక ఈ కాలంలో బాలిక తన ప్రియుడితో కలిసి గండికోటకు పలుమార్లు వెళ్లినట్లు తెలిసింది. దీంతో ఈ హత్యను పక్కా ప్లాన్‌తో, ముందు నుంచే స్కెచ్ వేసి అమలు చేశారని తెలుస్తోంది.
Details
సమగ్రంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఇక హత్యకు మూడురోజుల ముందు బాలిక తన ప్రియుడితో ఇంస్టాగ్రామ్‌లో చాటింగ్ చేసినట్టు సమాచారం. 'ఎక్కడ?', 'ఎప్పుడు?', 'ఎలా కలవాలి?' వంటి విషయాలపై వారి మధ్య చర్చ జరిగిందా అనే కోణం ఆధారంగా పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. కుటుంబ సభ్యులు ఈ చాటింగ్‌ను పసిగట్టిన అవకాశముందా? ఆ సమాచారాన్ని ఉపయోగించి పక్కా స్కెచ్ వేశారా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఈ కేసులో అనేక కోణాల నుంచి విచారణ సాగుతోంది. మిగిలిన వాటితో పాటు, ఈ హత్య వెనుక ఎవరి కుట్ర దాగి ఉందన్న విషయంపై స్పష్టత రానున్నది.