Amritpal Singh: ఖలిస్తానీ మద్దతుదారు అమృతపాల్ సింగ్ తల్లి అరెస్ట్.. కారణం ఇదే..
పంజాబ్‌లో, ఖలిస్తానీ మద్దతుదారు,'వారిస్ పంజాబ్ దే'అధినేత అమృతపాల్ సింగ్ తల్లి బల్వీందర్ కౌర్‌ను అరెస్టు చేశారు. తన కొడుకు జైలును మార్చాలని డిమాండ్ చేస్తూ ఆమె 'చేత్నా మార్చ్'కి పిలుపునిచ్చారు. దీనికి ముందు, అమృత్‌సర్‌లో ఆమెను అరెస్టు చేసి ఆమెపై కేసు కూడా నమోదు చేశారు. బల్వీందర్ కౌర్ తన కుమారుడు అమృత్‌పాల్ సింగ్ ను అస్సాం జైలు నుండి పంజాబ్ జైలుకు మార్చాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర చేపట్టారు. ఆదివారం సాయంత్రం పోలీసులు అమృత్‌పాల్ సింగ్ తల్లిని అరెస్ట్ చేశారు. దీంతో పాటు బల్వీందర్ కౌర్,ఆమె మామ సుఖ్‌చైన్ సింగ్,మరో ముగ్గురిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ముందుజాగ్రత్త చర్యగా బల్వీందర్ కౌర్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో అమృత్‌పాల్
గత ఏడాది ఏప్రిల్‌లో ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అమృత్‌పాల్ సింగ్, అతని తొమ్మిది మంది సహచరులు ప్రస్తుతం అసోంలోని దిబ్రూగఢ్ జైలులో ఉన్నారు. పంజాబ్‌లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించడంతో పాటు పోలీస్ స్టేషన్‌పై అమృత్‌పాల్ సింగ్, అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. దీంతో పాటు అతనికి ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడిని ఏప్రిల్ 2023లో అరెస్ట్ చేసి అసోంలోని దిబ్రూగఢ్ జైలుకు తరలించారు.