NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / సెప్టెంబర్ 17పై బీఆర్ఎస్ కీలక నిర్ణయం.. జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహిస్తామని ప్రకటన
    తదుపరి వార్తా కథనం
    సెప్టెంబర్ 17పై బీఆర్ఎస్ కీలక నిర్ణయం.. జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహిస్తామని ప్రకటన
    జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహిస్తామని ప్రకటన

    సెప్టెంబర్ 17పై బీఆర్ఎస్ కీలక నిర్ణయం.. జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహిస్తామని ప్రకటన

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 10, 2023
    04:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సెప్టెంబర్‌ 17న జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ శ్రేణులు 17న జాతీయ సమైక్యతా దినోత్సవంలో పాల్గొనాలని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.

    ఇప్పటికే సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ విమోచన దినం పేరిట భారీ బహిరంగ సభకు రెడీ అవుతోంది. దీనికి కేంద్రహోంమంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా రానున్నారు.

    మరోవైపు అదే తేదీన హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్నాయి. సోనియాగాంధీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీయనున్నారు.

    విమోచన దినోత్సవంపై నిర్ణయం చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ సమైక్యతా రాగం అందుకున్నారు.

    DETAILS

    జాతీయ సమైక్యతకు ప్రతీక : మంత్రి కేటీఆర్

    1948 సెప్టెంబర్ 17న భారతంలో తెలంగాణ అంతర్భాగంగా మారిపోయిన రోజని మంత్రి కేటీఆర్ అన్నారు. నిజాం రాచరిక పరిపాలన నుంచి తెలంగాణ(హైదరాబాద్ రాష్ట్రం) ప్రజాస్వామ్యంలోకి మార్పు చెందన రోజని గుర్తు చేశారు.

    జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17ను, రాజకీయాల కోసం వక్రీకరించి, స్వార్థ ప్రయోజనాలను వాడుకోవాలని చూస్తున్నారన్నారు. అవకాశవాద రాజకీయాలతో తెలంగాణ చరిత్రను మార్చి, మలినం చేసేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు.

    విచ్ఛిన్నకర శక్తుల కుట్రలను తిప్పికొట్టాలని మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులతో పాటు ప్రజలను కోరారు. తెలంగాణ ఏర్పడ్డాక గత 10 ఏళ్లలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను జోడెడ్లుగా పరిగెత్తిస్తున్నామని వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీఆర్ఎస్
    కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)

    తాజా

    Mango Chutney: సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఆమ్ చట్నీ.. మీరూ ఓసారి ట్రై చేయండి లేకపోతే మిస్‌యిపోతారు!తయారీ విధానం ఇదిగో.. వంటగది
    Mini Kashmir: కశ్మీర్‌కు బదులుగా ఈ మినీ కశ్మీర్‌కెళ్లండి.. ఇదే రైట్ టైమ్! జమ్ముకశ్మీర్
    Ravindra Jadeja: జడేజాకు టెస్ట్ సారథ్య బాధ్యతలు ఇవ్వాలి : అశ్విన్ జడేజా
    P Chidambaram:: 'ఇండియా అలయన్స్ వేస్ట్'.. 2029 లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం  ఇండియా కూటమి

    బీఆర్ఎస్

    సబితను పార్టీలోకి తీసుకుని కేసీఆర్ తప్పు చేశారు.. టిక్కెట్ ఇవ్వకుంటే కారు దిగిపోతానన్న తీగల కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    బీఆర్ఎస్ పార్టీలో టిక్కెట్ల కుమ్ములాట.. మంత్రి హరీశ్‌రావుపై మైనంపల్లి తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణ
    కాంగ్రెస్ గూటికి చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్.. ఇప్పటికే టిక్కెట్ కోసం దరఖాస్తు  కాంగ్రెస్
    తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. గద్వాల్ ఎమ్మెల్యేగా డీకే అరుణ  గద్వాల

    కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)

    సత్య నాదెళ్లను కలిసిన కేటీఆర్: బిజినెస్, హైదరాబాద్ బిర్యానీపై చర్చ సత్య నాదెళ్ల
    తెలంగాణలో పెట్టుబడులు పెట్టి, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములుకండి: కేటీఆర్ స్విట్జర్లాండ్
    కేటీఆర్: తెలంగాణలో గ్లోబల్ రెస్టారెంట్ కంపెనీ 'ఇన్‌స్పైర్ బ్రాండ్స్' పెట్టుబడులు తెలంగాణ
    హైదరాబాద్‌లో అమెజాన్ ఎయిర్ సేవలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ అమెజాన్‌
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025