
Mizoram: ఐజ్వాల్‌లో భారీ వర్షం కారణంగా గని కూలి.. పది మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
మిజోరం రాజధాని ఐజ్వాల్ శివార్లలో భారీ వర్షాల కారణంగా ఓ గని కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు పది మంది ప్రాణాలు కోల్పోయారు.
పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. భారీ వర్షాల కారణంగా నదుల నీటిమట్టం కూడా పెరిగింది. నది ఒడ్డున నివసించే ప్రజలు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ముఖ్యమంత్రి లాల్ దుహోమా సమావేశం ఏర్పాటు చేశారు.
Details
భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి
ఐజ్వాల్ నగరం దక్షిణ శివార్లలో మెల్తామ్,హ్లిమెన్ మధ్య ఉదయం 6గంటలకు ఈసంఘటన జరిగింది.
శిథిలాల నుంచి ఇప్పటి వరకు పది మంది మృతదేహాలను బయటకు తీశామని,ఇంకా చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయారని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)అనిల్ శుక్లా తెలిపారు.
మృతుల్లో ఏడుగురు స్థానికులు కాగా,ముగ్గురు ఇతర రాష్ట్రాలకు చెందిన వారని అధికారులు తెలిపారు.
శిథిలాల కింద ఇంకా పది మందికి పైగా చిక్కుకునే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు.
భారీ వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన సంఘటనలు నమోదయ్యాయి.
హంథర్‌లోని జాతీయ రహదారి-6పై కొండచరియలు విరిగిపడటంతో ఐజ్వాల్ దేశంలోని ఇతర ప్రాంతాలతో సంబంధం లేకుండా పోయింది.
వర్షాల కారణంగా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అన్ని పాఠశాలలను మూసివేశారు.
Details
సీఎం లల్దుహోమ సమావేశం ఏర్పాటు
రెమల్ తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి కనీసం ఇద్దరు మరణించారు.
ఐజ్వాల్‌లోని సేలం వెంగ్‌లో కొండచరియలు విరిగిపడటంతో భవనం కుప్పకూలిందని, ఈ ప్రమాదంలో ముగ్గురు గల్లంతయ్యారని ఒక అధికారి తెలిపారు.
ప్రస్తుతం వారి అన్వేషణ కొనసాగుతోంది. కొండచరియలు విరిగిపడటంతో అనేక అంతర్రాష్ట్ర రహదారులు కూడా మూతబడ్డాయి.
ప్రస్తుత పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి లల్దుహోమ హోంమంత్రి కె. సప్దంగా, చీఫ్ సెక్రటరీ రేణు శర్మ , ఇతర సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు.